Category: నంద్యాలజిల్లా

నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ 26 గేట్ల ద్వారా నీటిని విడుదల

నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ 26 గేట్ల ద్వారా శుక్రవారం నీటిని విడుదల చేసిన అధికారులు. 22 క్రస్ట్‌గేట్లను 5 అడుగులు, 4గేట్లను 10అడుగుల మేర ఎత్తి 2,30,504 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జునసాగర్‌ జలాశ యం నీటిమట్టం 587.50 అడుగులు ఉంది. ఇది 305.80 టీఎంసీలకు సమానం. కుడి కాలువ ద్వారా 8680 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 8367, 26 క్రస్ట్‌గేట్ల ద్వారా 2,30,504, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 29,029, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 2,78,380 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 3,11,491 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కాగా 26 క్రస్ట్‌గేట్ల ద్వారా నీరు విడుదల చేస్తుండడంతో తిలకించేందుకు పర్యాటకులు శుక్రవారం పోటెత్తారు. రహదారులు పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ సందడిగా గడిపారు. 42 టీఎంసీలకు చేరిన నదీ జలాలు వరదతో ... Read more

శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు

శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. గత నెల జూలైలో ప్రారంభమైన వరద ప్రవాహంతో క్రమంగా జలాశయం నిండుకుంది. జూలై 29 తేదీన జలాశయం మూడు క్రస్టు గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ పరివాహక ప్రాంతాలు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుండడంతో శుక్రవారం డ్యామ్‌ అధికారులు జలాశయం 10 క్రస్టుగేట్లును 14 అడుగులు ఎత్తి నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 2,89,265 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 40,311 క్యూసెక్కులు మొత్తం 3,29,576 వరద ప్రవాహం వస్తోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 3,92,415 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు ... Read more

పూర్తి స్థాయి నీటి మట్టానికి అడుగు దూరంలో శ్రీశైలం రిజర్వాయర్, సాగర్‌ వైపు కృష్ణమ్మ పరవళ్లు-srisailam reservoir a foot away from full water level krishnamma paravallu towards sagar ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

మంగళవారం రాత్రికి జూరాల నుంచి 2,81,196 క్యూసెక్కులు, తుంగభద్ర ద్వారా 1,07,246 క్యూసెక్కులతో కలిపి 3,88,442 క్యూసెక్కుల నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతున్నాయి. జలాశయ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.50 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215 టీఎంసీలుగా నమోదైంది. Telugu HindustanTimes