Category: ప-గో-జిల్లా
Bhimavaram : మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిలో ఐటి అధికారుల సోదాలు.
భీమవరం వైయస్సార్ సీసీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ అధికారులు బుధవారం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆద్వర్యంలో గ్రంధి శ్రీనివాస్ కు సంబందించిన కృష్ణా జిల్లా నాగాయలంక ఆఫీస్, ఇతర వ్యాపార సముదాయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు.అధికారులు గ్రంధి శ్రీనివాస్ ఆదాయ లావాదేవీలకు సంబందించి విచారిస్తున్నట్లు సమాచారం.
Bhimavaram : అయోధ్య శ్రీరామునికి 13 కేజీల వెండి, ఒక కేజీ బంగారంతో తయారుచేసిన ధనస్సు – శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు అందుకున్న అయోధ్య రాముని మహా ధనస్సు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మాట్లాడుతూ అయోధ్య నగరానికి వెళుతున్న ఈ రామ ధనస్సు ఎంతో విశిష్టమైనదని, ఏడు మోక్షమార్గాలలో అయోధ్య మొదటిదని, ఒక కేజీ బంగారం, 13 కేజీలు వెండితో తయారు చేసిన ధనస్సు చల్లా శ్రీనివాస ఆధ్వర్యంలో శ్రీరాముడు పుట్టిన అయోధ్యకు ఈ ధనుస్సుని తీసుకువెళుతున్నారని, ఈ ధనస్సు ఈ ప్రాంతానికి రావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని తెలిపారు. శ్రీ మావుళ్ళమ్మ ఆలయం వద్ద జైశ్రీరామ్ నినాదాలతో భక్తి పారవశ్యంతో పర్వసిశించారు భక్తులు.
Undi : పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభించిన ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు.
ఉండి నియోజకవర్గం ప్రధాన కేంద్రమైన ఉండి పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభించిన. స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ పి నాగరాణి. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఎస్పీ మాట్లాడుతూ నూతన భవనాన్ని ప్రజా ప్రతినిధులతో ప్రారంభించడం జరిగిందని అన్నారు ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ త్వరలోనే నియోజకవర్గం లో పోలీస్ స్టేషన్లను మారుస్తున్నట్లు అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ కు కొత్త వెహికల్ ఏర్పాటు చేస్తున్నట్లు క్రైమ్ రేట్ తగ్గించే దిశగా నియోజవర్గం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Palakollu : నేడు టిడ్కో గృహవాసులకు ఉచిత కొత్త వాహనం ప్రారంభం
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లోని టిడ్కో గృహాల కాలనీవాసులకు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుపుతున్న వాహనాన్ని ఈరోజు ఆదివారం ప్రారంభించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కాలనీవాసులు వివిధ పనుల నిమిత్తం గాంధీ బొమ్మల సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే దూరం కావడంతో ఎటువంటి వాహనాలు లేక ముఖ్యంగా మహిళలు నడిచి వెళ్ళవలసి వచ్చేది. వీరి పరిస్థితిని అర్థం చేసుకున్న మన మంత్రి నిమ్మల రామానాయుడు ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న హయాంలోనే ఉచిత ప్రయాణ వాహనాన్ని ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఆ ప్రాంతవాసులు ఉదయం నుంచి రాత్రి వరకు ఉచిత వాహనంలో రాకపోకలు సాగిస్తున్నారు. ఆ వాహనం కొంత పాతది కావడంతో అన్ని సౌకర్యాలతో మరో కొత్త వాహనాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరొకటి కొనుగోలు చేసి ఆ ప్రాంత వాసుల కోసం సిద్ధం చేశారు. కాలనీవాసులకు ప్రత్యేకంగా ఉచిత వాహనాన్ని ... Read more
mohan ranga : రంగా పేరు పెట్టాలి అని కోరిన రాధా రంగా మిత్రమoడలి
హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ను కలిసి ఒక జిల్లాకి మోహన్ రంగా పేరు పెట్టాలని కోరిన రాధా రంగా మిత్రమండలి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లోని సైనిక్ స్కూల్ వద్ద రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ను కలిసి పుష్పగుచ్చం అందించిన రాధ రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పన్నాస పూర్ణచంద్రరావు (కాళపాలెం బుజ్జి) రాష్ట్రంలో ఒక జిల్లాకి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టేలా ప్రతిపాదన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాధా రంగా మిత్రమండలి నాయకులు పాల్గొన్నారు.
గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో భార్య భర్తలు మృతి : తాడేపల్లిగూడెం
తాడేపల్లిగూడెం మండలంలో గ్యాస్ లీకై అగ్నిప్రమాదం సంభ వించడంతో గాయాలపాలైన కుటుంబం తాడేపల్లిగూడెం ఏరియా ఆసు పత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్య, భర్తలు గురువారం మృతి చెందారు. తాడేపల్లిగూడెం మండలం ఎల్.అగ్రహారంలోని టిడ్‌కో ఇళ్ల వద్ద మంగళవారం ఉదయం గ్యాస్ బండ పేలిన ఘటనలో భార్య భర్తలు బోడపాడు మురళి (37), బోడపాడు కుమారి (34), కుమార్తె నీలిమలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో వారిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మురళి, కుమారిలు గురువారం మృతి చెందారు. నీలిమకు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రమేష్ వివరించారు.
ఘనంగా పైడితల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ
ఘనంగా పైడితల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ పైడితల్లి అమ్మవారి నామస్మరణతో జువ్వలపాలెం గ్రామం మారుమోగింది. కాళ్ళ మండలం జువ్వలపాలెం గ్రామంలోని తూర్పుపేటలో భక్తులు, దాతలు, గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో నూతనంగా నిర్మించిన గ్రామదేవత పైడితల్లి అమ్మవారి ఆలయంలో విగ్రహం, ఆలయ శిఖర, జీవధ్వజ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు పుల్లేటికుర్తి గణపతిశర్మ బ్రహ్మత్వంలో గురువారం ఉదయం 9:30 నిమిషాలకు వేదమంత్రాల నడుమ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.నర్సాపురం పార్లమెంట్ మాజీ సభ్యుడు గోకరాజు గంగరాజు, టీడీపీ బోర్డు మాజీ సభ్యుడు గోకరాజు రామరాజు, జనసేన నాయకుడు చెనమల్ల చంద్రశేఖర్తో పాటు పలువురు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు