Category: ఎన్టీఆర్-జిల్లా

Vijayawada : 11వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రి పై భవానీ దీక్షల స్వీకరణ

……………………. విజయవాడ దుర్గమ్మ ఆలయంలోనవంబర్ 11 నుంచి భవానీ దీక్షలు ప్రారంభం కానున్నట్టు ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. 11వ తేదీ ఉదయం 11గంటలకు మండల దీక్ష స్వీకరణ ప్రారంభిస్తారు. 15వరకు దీక్షల స్వీకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. డిసెంబర్1వ తేదీన అర్ధమండల దీక్షల విరమణలు ప్రారంభమై డిసెంబర్ 5వ తేదీతో ముగుస్తుంది. డిసెంబర్ 21 నుంచి 25 వరకు మండల దీక్షల విరమణలు జరుగుతాయి. దీంతో డిసెంబర్ 21నుంచి 26 తేదీ వరకు ఆలయంలో ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఏకాంతంగా అర్చకులు మాత్రమే సేవలునిర్వహిస్తారు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా ప్రతిష్ఠాపన, శతచండీయాగం, గిరి ప్రదక్షిణలు నిర్వహించనున్నారు. ……………………..

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి భక్తి పాటలు ఆవిష్కరించిన శ్రీరామ్ తాతయ్య – పాటలు రచించి, పాడిన సయ్యద్ జమీల్ అహ్మద్.

కైకలూరు విద్యాంజలి విద్యాసంస్థల అధినేత సయ్యద్ జమీల్ అహ్మద్ స్వయంగా రచించి పాడిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి రెండు భక్తి పాటలను శ్రీ వాసవి మాత ముద్దుబిడ్డ, ఆర్యవైశ్య అభిమాన నాయకుడు, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య వారి చేతుల మీదుగా బుధవారం నాడు ఆవిష్కరించారు. అనంతరం శ్రీరాం తాతయ్య రచయత,సిగర్ జమీల్ ను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ముస్లిం సోదరుడు కుల మతాలకు అతీతంగా ఆర్యవైశ్యుల ఇలవేల్పు అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిపై పాటలు రచించి, పాడడం మా ఆర్యవైశ్యులందరికీ గర్వకారణం అని అభినందించారు. ఈ కార్యక్రమంలో పైడిమర్రి జయ శ్యామల మాల్యాద్రి రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి, ఈదా వెంకటస్వామి కైకలూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి, గడిదేసి విజయ్, కనిశెట్టి శ్యామ్, జగ్గయ్యపేట ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు పాల్గొన్నారు.

వైయస్ఆర్ సీపి : ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా దేవినేని అవినాష్ పదవి బాధ్యత స్వీకార సభ

అమ్మఒడి, రైతు భరోసా పధకాలు కనుమరుగయ్యాయి, దీపం పధకం నీరుగారిపోయింది – వెలంపల్లి శ్రీనివాసరావు. విజయవాడ బందరు రోడ్ లోని శేష సాయి కళ్యాణ మండపం నందు ఆదివారం నాడు వైభవంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా దేవినేని అవినాష్ పదవి బాధ్యత స్వీకార మహోత్సవం మరియు జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిధులుగా పాల్గొన్న రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, PAC మెంబర్, పశ్చిమ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, కృష్ణ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పేర్ని నాని, సెంట్రల్ ఇంచార్జ్ మల్లాది విష్ణు, నందిగామ ఇంచార్జ్ మొండితోక జగన్ మోహనరావు, తిరువూరు ఇంచార్జ్ నలగట్ల స్వామిదాస్, జగయ్యపేట ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు తదితర వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ... Read more

Nandigama : దీపం పథకం గ్యాస్ సిలిండర్లను అందజేసిన శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య

ఇంటికి దీపం ఇల్లాలు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు మహిళా పక్షపాతి , ఆంధ్ర రాష్ట్రానికి చీకట్లు పోయి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే దీపావళి పండుగ వచ్చేసింది – ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య నందిగామ పట్టణం పాత బస్టాండ్ బాబు జగజీవన్ రామ్ ఫంక్షన్ హాల్ నందు శుక్రవారం నాడు అధికారులు మరియు ఎన్డీఏ కూటమినేతలతో కలిసి దీపం పథకం – 2 ను ప్రారంభించి లబ్ధిదారులకు ఉచితముగా మూడు గ్యాస్ సిలిండర్లను అందజేసిన శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను చూడగానే చాలా సంతోషం కలిగింది ఏ విషయమైనా ఉపాధ్యాయులు చాలా స్పష్టముగా వివరించగలరు. దేశమంతటా దీపావళి నిన్న వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ముందుగానే వచ్చేసింది కూటమి ప్రభుత్వ హామీలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఉచితముగా మూడు గ్యాస్ సిలిండర్లను ప్రకటించిన నాడే దీపావళి పండుగ వచ్చేసింది. అధికారంలోకి రాగానే ... Read more

మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమలలు : ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి.. సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అంటూ నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదశ్ ఉపాధ్యాయ సంఘం ఎన్టీఆర్ జిల్లా శాఖ ద్వితీయ కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సత్యం, అహింస ఆయుధాలుగా భారత దేశపు స్వేచ్ఛా స్వాతంత్య్ర సమరాన్ని ముందుండి నడిపిన జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమలలువేసి నివాళులు అర్పించారు. స్వరాజ్యం సాధించిన బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యం కావాలన్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. వారి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యాశాఖ అంటే ఒక పరీక్ష. ఛాలెంజ్‌ ... Read more