Category: నెల్లూరుజిల్లా

anam -కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తాము – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

కృష్ణా, గోదావరి సంగమం వద్ద జలహారతులు పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు నియమిస్తామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. నెల్లూరు : కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు నియమిస్తామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సిజిఎఫ్ కింద 160 ఆలయాలు పున: నిర్మిస్తామని ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు ఆలయ భూములు పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. 50వేల రూపాయలు కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఆర్థిక సాయం పెంచుతున్నట్లు ప్రకటించారు. తిరుమల నుంచే దేవాదాయ శాఖలో ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకుంటున్నామని అన్నారు. నెల్లూరు జిల్లాలో ... Read more

పచ్చని కాపురంలో “మద్యం చిచ్చు” : ఒకరు ఉరి వేసుకొని, ఒకరు రైలు కింద పడి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న వైనం. అనాథలైన నెలల వయసున్న చిన్నారులు.

నెల్లూరు జిల్లా ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన కె నాగరాజు (23), సురేఖ(19) భార్యాభర్తలు. నాలుగేళ్ల కిందట ఇద్దరూ ప్రేమించి, వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్లు, 11 నెలల కుమారులు ఉన్నారు. నాగరాజు టైల్స్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేశాడు. సురేఖ మాగుంట లేఅవుట్‌లో ఓ బ్యూటీ పార్లర్‌లో బ్యూటీషియన్‌గా చేస్తుంది. చక్కగా సాగుతున్న వీరి కాపురాన్ని మద్యం చిన్నాభిన్నం చేసింది. నాగరాజు తాగుడుకి బానిసై, సంపాదించిన డబ్బంతా మద్యానికి ఖర్చు చేసేవాడు. ఈ క్రమంలో పలుచోట్ల అప్పులు చేశాడు. దీంతో కుటుంబ భారం మొత్తం సురేఖపై పడింది. మద్యం మానేయాలని, అప్పులు చేయవద్దని సురేఖ భర్తను వేడుకుంది. తీరు మార్చుకోని నాగరాజు మద్యం అలవాటును మానుకోవడానికి బదులు పుట్టింటికి వెళ్లి మద్యానికి డబ్బు తీసుకురావాలని సురేఖను ఒత్తిడి చేయసాగాడు. ఆ క్రమంలో భార్యభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులతో విసిగిన సురేఖ శనివారం ఇంట్లోనే ... Read more