Category: కృష్ణాజిల్లా
Avanigadda : లా అండ్ ఆర్డర్ సమస్యలకు కారకులయ్యే వారిని సహించేది లేదు – అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్
ఫ్లెక్సీలు, సోషల్ మీడియా పోస్టులతో లా అండ్ ఆర్డర్ సమస్యలకు కారకులయ్యే వారిని సహించేది లేదు :అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ శనివారం అవనిగడ్డ పోలీస్ స్టేషనులో ఆయన మీడియాతో మాట్లాడుతూ .. ఫ్లెక్సీల ఏర్పాటుకు పంచాయతీ, విద్యుత్ శాఖల అనుమతి తీసుకోవాలన్నారు. ఇతరుల, సమూహాల, వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా ఫ్లెక్సీలు వేయిస్తే వాటిని తయారు చేయించే వారితో పాటు, ముద్రించే వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా వేడుకలకు అనుమతి తీసుకొని ఏర్పాటు చేసుకునే ఫ్లెక్సీలు సందర్భం పూర్తి కాగానే తొలగించాలని స్పష్టం చేశారు. సమస్యలు సృష్టించే ప్రదేశాల్లో ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వవద్దని ఇప్పటికే సంబంధిత శాఖలకు లేఖలు రాసినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పదేపదే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారిపై చట్టపరంగా రౌడీషీట్లు కూడా ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అవనిగడ్డ సర్కిల్ ... Read more
గుడివాడ : దీపం-2 పథక లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందచేసిన నాయకులు
దీపం-2 పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని కూటమి పార్టీల నాయకులు పేర్కొన్నారు. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని విజయ గ్యాస్ ఏజెన్సీలో కూటమి పార్టీల నేతలతో కలిసి…మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, కృష్ణా జిల్లా బిజెపి అధ్యక్షుడు గుత్తికొండ శ్రీ రాజబాబు దీపం-2 పథక లబ్ధిదారులకు.. ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా.. సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. అబద్దాలపై పాలన చేసిన వైకాపా… ఇప్పటికీ బుద్ధి మార్చుకోక ఆకాశంపైకి ఉమ్మి వేసినట్లు సామాజిక మాధ్యమాల్లో… కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తుందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేసే కూటమి ప్రభుత్వంపై వైకాపా సైకోలు చేసే ప్రచారాన్ని ప్రజలెవరు విశ్వసించరని బుద్ధి ... Read more