Category: కైకలూరు

kaikaluru : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దసరా మహోత్సవాలు ప్రారంభం.

కైకలూరు సెంటర్ లో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి క్షేత్రం నందు 44వ దసరా శరన్నవరాత్రి ఉత్సవములు శ్రీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం ఆద్వర్యంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్.కామినేని శ్రీనివాస్ కు ఆలయ మర్యాదలతో సత్కరించి ప్రసాదం అందించిన శ్రీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సేవాసంఘం అద్యక్షులు చొప్పర్ల మురళీకృష్ణ, సంఘ నాయకులు. పొన్నూరు కుటుంబ దంపతులచే కలశ స్థాపన చేసి పూజలు నిర్వహించిన అర్చకులు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ఆర్యవైశ్య నాయకులు, మాలధారణ భవానీలు, స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు – నివాళులుఅర్పించిన కామినేని

కైకలూరు గాంధీబొమ్మ సెంటర్ వద్ద స్వాతంత్ర సమరయోధులలో ప్రముఖులు జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులుఅర్పించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు. ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతూ మన భారతీయులు అందరూ జాతీపిత గా పిలుచుకునే మహాత్మ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆశ్రమం పెట్టి, అలానే సత్యాగ్రహం ధ్వారా హింసతో కాకుండా అహింసతోనే మనం ఉండాలని ప్రజలకు వివరిస్తూ, అహింసతోనే తెల్లవారిని(బ్రిటిష్ వారిని) తరిమిన స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ అని. అందుకే మనం అందరం మహాత్మ గాంధీ అని పిలుచుకుంటున్నాము అని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

వృద్ధులను ఆదరించకుంటే జైలు శిక్ష తప్పదు

వయోభారంలో ఉన్న వృద్ధులను వారి వారసులు ఆదరించకుండా ఇబ్బంది పెడితే జైలు శిక్ష తప్పదని సీనియర్ సివిల్ జడ్జి వివిఎన్వి లక్ష్మి హెచ్చరించారు. కైకలూరు కోర్టు ప్రాంగణంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయావృద్ధుల సంక్షేమ చట్టం 2007 ప్రకారం వారిని ఆదరించాలన్నారు. తల్లిదండ్రుల పోషణను విస్మరిస్తే వారి ద్వారా వారసులకు సంక్రమించే ఆస్తిని వెనుకకు తీసుకునే అవకాశం ఉందన్నారు. నిరాకరణకు గురైనట్లుగా రుజువైతే మూడు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని సూచించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పోషించే బాధ్యత వారి పిల్లలదేనని తెలియజేశారు. ఆ విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని, తల్లిదండ్రుల పోషణ నిమిత్తం వారికి కూడా మనోవర్తి ఇవ్వవలసి ఉంటుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పానల్ అడ్వకేట్స్ పి పవన్ కాంత్, డి శివప్రసాద్, బి ఇందిర తదితరులు పాల్గొన్నారు.

శ్రీ శ్యామలాంబ అమ్మవారి దసరా మహోత్సవాలు పోస్టర్ ఆవిష్కరణ

కైకలూరులోని శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగ, అత్యంత వైభవోపేతముగా నిర్వహించాలని స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ సూచించారు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి గోడపత్రిక, ప్రచార పత్రికలను మంగళవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఇలవేల్పు దేవత అయిన శ్రీ శ్యామలంబ అమ్మవారి దసరా మహోత్సవాలు విజయవంతం గా నిర్వహించాలన్నారు. తదనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సమకూర్చాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. సామాన్య భక్తులకు సునాయాసంగా అమ్మవారి దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలని, ప్రసాద నాణ్యతలో ఎక్కడ లోపం జరగకూడదన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ దగ్గరుండి పర్యవేక్షించి దసరా మహోత్సవాలను విజయవంతం చేస్తామన్నారు. కార్యనిర్వణ అధికారి విఎన్ కే శేఖర్ మాట్లాడుతూ అమ్మవారి భక్తులకు ఉచిత ప్రసాద, జల ప్రసాదం తో సహా అన్ని ... Read more

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు -కైకలూరు

ఏలూరు జిల్లా : కైకలూరు జిల్లా పరిషత్ ఓరియంటల్ ఉన్నత పాఠశాల నందు హెడ్ మాస్టర్ ఎ. శ్రీకృష్ణ ఆద్వర్యంలో 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొని జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేసారు. అనంతరం స్కూల్ ఉత్తమ విద్యార్థులకు ప్రత్యేక బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో మాజి ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు, జెడ్పీటీసీ కురెళ్ళ బేబి, ఎంపీపీ అడవి కృష్ణా, సర్పంచ్ దానం నవరత్న కుమారి, ఎన్డీఏ కూటమి నాయకులు, స్కూల్ కమిటి సబ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్డీఏ కూటమి నూతన కార్యాలయం ప్రారంభం – ముదినేపల్లి

ముదినేపల్లి మండలంలో మంగళవారం ఎన్డీఏ కూటమి నూతన కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసిన గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి డా” కొలుసు పార్ధసారధి, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, స్థానిక శాసనసభ్యులు డా” కామినేని శ్రీనివాస్. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రి పిన్నమనేని కోటేశ్వరరావు, మాజి ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు, జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, బిజేపి ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్. ప్రజలను చైతన్య పరుస్తూ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డా” మనోజ్ కుమార్తె, వైద్య విద్యార్థిని, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ని సత్కరించి, డా” బిఆర్ అంబేద్కర్ ప్రతిమను అందించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమిలోని టిడిపి, జనసేన, బిజేపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు డా” కామినేని శ్రీనివాస్

ఏలూరుజిల్లా మండవల్లి మండలం మండవల్లి లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు డా” కామినేని శ్రీనివాస్. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పధకాలను సద్వినియోగం చేసుకోవాలని, కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువు, క్రమశిక్షణతో మెలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

నాలుగు బైక్స్ రికవరీ ఇద్దరు అరెస్ట్ – ముదినేపల్లి

ముదినేపల్లి మండలంలో వరుస బైక్ దొంగతనాలు జరగడంతో! ముదినేపల్లి ఎస్సై డి. వెంకట్ కుమార్ తన సిబ్బందితో కలిసి ప్రత్యేక నిఘాతో జల్లూరి మణికంఠ, కొట్టి సాయిరామ్ అనే ఇద్దరుని అరెస్టు చేసి వీరి వద్దనుండి నాలుగు బైక్స్, రెండు ట్రాక్టర్ చక్రాలను స్వాదీన పరుచుకున్నారు. నిందితులను కైకలూరు కోర్టుకు తరలించిన పోలీసులు.