Category: దెందులూరు

Denduluru : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

రైతులు వద్ద నుండి ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లోకి నగదు జమవుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు. పెదపాడు మండలం కొక్కిరపాడు లోని రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఉదయం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. రైతు బాగుండాలి, వ్యవసాయం లాభసాటిగా వుండాలి అనే నినాదంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుందని, గతంలో రైతు కష్టపడి పండించిన పంటను అమ్మేందుకు చాలా ఆంక్షలు వుండేవని, కనీసం గోనే సంచులను సరఫరా చేయలేక గత ప్రభుత్వం చేతులెత్తేసిందని, ధాన్యం బకాయిలు ఎగ్గొట్టి రైతులను అవస్థలు పాలు చేసిందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. వైసిపి నాయకులు నిర్దేశించిన రైస్ మిల్లులోనే అమ్మాలని, రైతులను ఇబ్బంది పెట్టేవారని అటువంటి పరిస్థితి ఇకనుండి రైతులకు రాకూడదనే మిల్లులు ఎంపిక కూడా రైతులకే అందించామని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంక్ అకౌంట్లో ... Read more

Denduluru : అయ్యప్ప , భవాని మాల దీక్షాదారులకు అల్పాహారం – దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

అయ్యప్ప , భవాని మాల దీక్షాదారులకు ప్రతి రోజూ వడై (అల్పాహారం) ఏర్పాటు చేస్తున్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా చింతమనేని ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయిన ఆయన చేస్తున్న ప్రజా సేవా కార్యక్రమాలు మాత్రం ఏ రోజు ఆగకపోవటం చింతమనేని ప్రభాకర్ కార్యదక్షతకి నిదర్శనం అని చెప్పవచ్చు. కొవిడ్ విలయ తాండవం చేస్తున్న సమయంలో సైతం కొవిడ్ కేంద్రాల వద్ద పేషంట్లు బంధువులకు, అలాగే లాక్ డౌన్ టైమ్ లో హైవే పై ప్రయాణించే ప్రయాణికులకు లారీ డ్రైవర్లకు కూడా ఆహారాన్ని అందించారు చింతమనేని ప్రభాకర్. దుగ్గిరాల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిత్యం జరుగుతున్న స్వాములకు, భవానీలకు వడై (అల్పాహార) కార్యక్రమాలను సోమవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పర్యవేక్షించి, స్వాములు భవానీలతో కలిసి వడై స్వీకరించారు. ప్రతి నిత్యం వడై కోసం ... Read more

Denduluru : వకరిపై వకరు దాడి చేసుకున్న టీడీపీ, జనసేన శ్రేణులు.

వకరిపై వకరు దాడి చేసుకున్న టీడీపీ, జనసేన శ్రేణులు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పైడిచింతపాడు గ్రామంలో నవంబర్ నెల వృద్దాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘర్షణలో పలువురికి గాయలవ్వగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..