Category: కోస్తా ఆంధ్రా

AndhraPradesh : సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు – కోర్టుకి హాజరు పరిచిన పోలీసులు 14రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం.

……………. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియా ఫేస్బుక్ లో పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు డీఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు. సీఎం ఫోటోను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఎవరైనా అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు డీఎస్పీ జయరాం ప్రసాద్ హెచ్చరించారు. …………….

Bhimavaram : మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిలో ఐటి అధికారుల సోదాలు.

భీమవరం వైయస్సార్ సీసీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ అధికారులు బుధవారం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆద్వర్యంలో గ్రంధి శ్రీనివాస్ కు సంబందించిన కృష్ణా జిల్లా నాగాయలంక ఆఫీస్, ఇతర వ్యాపార సముదాయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు.అధికారులు గ్రంధి శ్రీనివాస్ ఆదాయ లావాదేవీలకు సంబందించి విచారిస్తున్నట్లు సమాచారం.

Vijayawada : 11వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రి పై భవానీ దీక్షల స్వీకరణ

……………………. విజయవాడ దుర్గమ్మ ఆలయంలోనవంబర్ 11 నుంచి భవానీ దీక్షలు ప్రారంభం కానున్నట్టు ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. 11వ తేదీ ఉదయం 11గంటలకు మండల దీక్ష స్వీకరణ ప్రారంభిస్తారు. 15వరకు దీక్షల స్వీకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. డిసెంబర్1వ తేదీన అర్ధమండల దీక్షల విరమణలు ప్రారంభమై డిసెంబర్ 5వ తేదీతో ముగుస్తుంది. డిసెంబర్ 21 నుంచి 25 వరకు మండల దీక్షల విరమణలు జరుగుతాయి. దీంతో డిసెంబర్ 21నుంచి 26 తేదీ వరకు ఆలయంలో ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఏకాంతంగా అర్చకులు మాత్రమే సేవలునిర్వహిస్తారు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా ప్రతిష్ఠాపన, శతచండీయాగం, గిరి ప్రదక్షిణలు నిర్వహించనున్నారు. ……………………..

Kaikaluru : కామినేని శ్రీనివాస్ ను కలిసిన గ్రీన్ విలేజ్ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.

కైకలూరులోని క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు డా” కామినేని శ్రీనివాస్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఏలూరు రోడ్డులోని గ్రీన్ విల్లెజ్ కాలనీ వాసులు. ఈ సందర్బంగా కాలని వాసులు మాట్లాడుతు కాలని ఎదురుగా పెద్దఎత్తున డంపింగ్ చేసిన చెత్తను తొలగించి తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు తీర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలానే కాలినీని అభివృద్ధి చెయ్యాలని కోరారు. శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి త్వరలోనే మీ సమస్యలు పరిష్కరించి కాలనీ అభివృద్ధి చేస్తామని తెలిపారు.

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి భక్తి పాటలు ఆవిష్కరించిన శ్రీరామ్ తాతయ్య – పాటలు రచించి, పాడిన సయ్యద్ జమీల్ అహ్మద్.

కైకలూరు విద్యాంజలి విద్యాసంస్థల అధినేత సయ్యద్ జమీల్ అహ్మద్ స్వయంగా రచించి పాడిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి రెండు భక్తి పాటలను శ్రీ వాసవి మాత ముద్దుబిడ్డ, ఆర్యవైశ్య అభిమాన నాయకుడు, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య వారి చేతుల మీదుగా బుధవారం నాడు ఆవిష్కరించారు. అనంతరం శ్రీరాం తాతయ్య రచయత,సిగర్ జమీల్ ను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ముస్లిం సోదరుడు కుల మతాలకు అతీతంగా ఆర్యవైశ్యుల ఇలవేల్పు అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిపై పాటలు రచించి, పాడడం మా ఆర్యవైశ్యులందరికీ గర్వకారణం అని అభినందించారు. ఈ కార్యక్రమంలో పైడిమర్రి జయ శ్యామల మాల్యాద్రి రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి, ఈదా వెంకటస్వామి కైకలూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి, గడిదేసి విజయ్, కనిశెట్టి శ్యామ్, జగ్గయ్యపేట ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు పాల్గొన్నారు.

Kaikaluru : సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వద్ద రాటను ప్రతిష్టించి షష్ఠి ఉత్సవ పనులను ప్రారంభించిన కామినేని శ్రీనివాస్.

ముదినేపల్లి మండలంలోని సింగరాయపాలెం గ్రామం చేవూరుపాలెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం నందు రానున్న షష్ఠి మహోత్సవాలు సందర్భంగా కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ బుధవారం ఉదయం ఆలయ ప్రాకారములో రాటను ప్రతిష్టించి షష్టి మహోత్సవ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామివారి షష్ఠి మహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని.. కమిటీ సభ్యులు ఓర్పుతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ సిబ్బంది మరియు కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలు ఆధ్యాత్మికతతో వైభవంగా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Bhimavaram : అయోధ్య శ్రీరామునికి 13 కేజీల వెండి, ఒక కేజీ బంగారంతో తయారుచేసిన ధనస్సు – శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు అందుకున్న అయోధ్య రాముని మహా ధనస్సు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మాట్లాడుతూ అయోధ్య నగరానికి వెళుతున్న ఈ రామ ధనస్సు ఎంతో విశిష్టమైనదని, ఏడు మోక్షమార్గాలలో అయోధ్య మొదటిదని, ఒక కేజీ బంగారం, 13 కేజీలు వెండితో తయారు చేసిన ధనస్సు చల్లా శ్రీనివాస ఆధ్వర్యంలో శ్రీరాముడు పుట్టిన అయోధ్యకు ఈ ధనుస్సుని తీసుకువెళుతున్నారని, ఈ ధనస్సు ఈ ప్రాంతానికి రావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని తెలిపారు. శ్రీ మావుళ్ళమ్మ ఆలయం వద్ద జైశ్రీరామ్ నినాదాలతో భక్తి పారవశ్యంతో పర్వసిశించారు భక్తులు.

Kaikaluru – Mubinepalli : అక్రమ మద్యం కలిగి ఉన్నా, బెల్టు షాపులు నిర్వహించినా చర్యలు తప్పవు – ఎస్సై వీరభద్రరావు హెచ్చరిక.

చట్ట విరుద్ధంగా అక్రమ మద్యం కలిగి ఉన్నా, బెల్ట్ షాప్ లు నిర్వహించినా కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ముదినేపల్లి ఎస్సై వీరభద్రరావు మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ… మండలంలోని వైవాక గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమ మద్యం కలిగి ఉండి బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో తన సిబ్బందితో కలిసి దాడిచేసి వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల వద్ద నుండి 120 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.