మరోవైపు బంగ్లాదేశ్లో హిందువులు సైతం తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. లక్షమందికిపైగా ప్రజలు.. ‘హిందువులను కాపాడండి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్డుపై నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు శాంతియుతంగా ఉండాలని, హిందువులపై దాడి చేయకుండా, వారికి రక్షణ కల్పించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పిలుపునిచ్చింది.