Author: ijam reporter

Description of the image

potti sriramulu : “ఆత్మార్పణ దినోత్సవం” ఘనంగా నిర్వహించిన ఆర్యవైశ్యులు – కైకలూరు

తెలుగు వారి ఆరాధ్యుడు శ్రీ పొట్టి శ్రీరాములు – కామినేని శ్రీనివాస్ గాంధీబొమ్మ సెంటర్ నందు ఆదివారం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా “ఆత్మార్పణ దినోత్సవం” ఆంద్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పోరేషన్ డైరెక్టర్ పి. జె. ఎస్. మాల్యాద్రి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కైకలూరు ప్రధాన రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ లో మాల్యాద్రి బైక్ పై కమ్మిలి విఠల్ రావు ర్యాలీ లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, నియోజకవర్గ ఆర్యవైశ్యులు, ఎన్డీఏ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం గాంధిబొమ్మ సెంటర్లోని పొట్టి శ్రీరాములు, గాంధీజి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్. అనంతరం కృతజ్ఞతా సభలొ పాల్గొని పొట్టి శ్రీరాములు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం ఎవరూ చేయలేనిదని, తెలుగు వారందరికీ ... Read more

AndhraPradesh : త్వరలో గ్రామ పంచాయతీలకు నిధులు, సర్పంచ్లకు శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్.

సర్పంచ్ లతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. ఈ భేటీలో మొత్తం 16 అంశాలను సర్పంచ్ లు పవన్ ముందు ఉంచారు. రాజధానిలో భవన నిర్మాణం కోసం. రెండు ఎకరాల స్థలం అడిగారు వారి విజ్ఞప్తిపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు.ప్రభుత్వం నిధులు ఆపడం లేదు. 15 ఫైనాన్స్ డబ్బులు త్వరలో అకౌంట్లలో జమ అవుతాయి గ్రామీణ అభివృద్ధికి కేంద్రం, రాష్ట్రం కట్టుబడి ఉంది. గత ప్రభుత్వం వాలంటీర్లను మోసం చేసింది. జీతాలు పెంచాలని జీవోలో ఎక్కడా లేదు. పార్టీల పరంగా విభేదాలు ఉండొచ్చు కానీ, అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ గ్రామ వాలంటీర్లను దారుణంగా మోసం చేసి మట్టుపెట్టుకుందని, గ్రామ వాలంటీర్లకు ఇచ్చిన మాట నిరవేరుద్దాం అని చూస్తుంటే ఎక్కడా జీవోలో వాళ్లు లేరు. ఉద్యోగాలే కావు అవి ... Read more

AndhraPradesh : సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు – కోర్టుకి హాజరు పరిచిన పోలీసులు 14రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం.

……………. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియా ఫేస్బుక్ లో పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు డీఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు. సీఎం ఫోటోను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఎవరైనా అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు డీఎస్పీ జయరాం ప్రసాద్ హెచ్చరించారు. …………….

AndhraPradesh : కేంద్ర మంత్రి అమిత్‌ షాతో పవన్‌ కల్యాణ్‌ భేటీ – డిప్యూటీ సీఎంగా తొలిసారి భేటీ

డీల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి పవన్‌ అమిత్‌షాతో సమావేశమయ్యారు. సహకార శాఖ నుంచి నిధుల కేటాయింపుపై అమిత్‌ షాతో పవన్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశం ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం

Tirupati : టీటీడీలో ప్రక్షాళన జరిగింది కాబట్టే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయి టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు.

వచ్చే బోర్డు మీటింగ్‌లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం- టీటీడీ నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు టీటీడీ నూతన ఛైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. తనకు ఆ బాధ్యత అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు వచ్చే బోర్డు మీటింగ్ లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి కొన్ని మార్పులు చెయ్యాల్సి ఉందన్నారు. సవాళ్లు ఉన్నాయని, అన్నింటిని అధిగమిస్తామన్నారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ ఎలా కాపాడుకోవాలి అనే దానిపై దృష్టి పెడతామన్నారు ఉద్యోగాల నియామకాలపై అధ్యయనం చేస్తామన్నారు. శ్రీవాణిపై ప్రజల్లో అపోహ ఉందన్న బీఆర్ నాయుడు.. విజిలెన్స్ విచారణ జరుగుతోందని, సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. టీటీడీలో ప్రక్షాళన జరిగింది కాబట్టే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయని టీటీడీ నూతన ఛైర్మన్ అన్నారు. టీటీడీ నూతన ఛైర్మన్ గా బీఆర్ నాయుడు ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 16 ... Read more

Bhimavaram : మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిలో ఐటి అధికారుల సోదాలు.

భీమవరం వైయస్సార్ సీసీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ అధికారులు బుధవారం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆద్వర్యంలో గ్రంధి శ్రీనివాస్ కు సంబందించిన కృష్ణా జిల్లా నాగాయలంక ఆఫీస్, ఇతర వ్యాపార సముదాయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు.అధికారులు గ్రంధి శ్రీనివాస్ ఆదాయ లావాదేవీలకు సంబందించి విచారిస్తున్నట్లు సమాచారం.

Vijayawada : 11వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రి పై భవానీ దీక్షల స్వీకరణ

……………………. విజయవాడ దుర్గమ్మ ఆలయంలోనవంబర్ 11 నుంచి భవానీ దీక్షలు ప్రారంభం కానున్నట్టు ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. 11వ తేదీ ఉదయం 11గంటలకు మండల దీక్ష స్వీకరణ ప్రారంభిస్తారు. 15వరకు దీక్షల స్వీకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. డిసెంబర్1వ తేదీన అర్ధమండల దీక్షల విరమణలు ప్రారంభమై డిసెంబర్ 5వ తేదీతో ముగుస్తుంది. డిసెంబర్ 21 నుంచి 25 వరకు మండల దీక్షల విరమణలు జరుగుతాయి. దీంతో డిసెంబర్ 21నుంచి 26 తేదీ వరకు ఆలయంలో ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఏకాంతంగా అర్చకులు మాత్రమే సేవలునిర్వహిస్తారు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా ప్రతిష్ఠాపన, శతచండీయాగం, గిరి ప్రదక్షిణలు నిర్వహించనున్నారు. ……………………..

AndhraPradesh : మైక్ ముందు మంత్రినే కాదు – మక్కెలిరగ్గొట్టించే మంత్రిని కూడా “అంబటికి అనిత కౌంటర్”

ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య నిరంతరం ఏదో ఒక విషయంలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. హోంశాఖపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. వైసీపీ నేతలు హోంమంత్రి వంగలపూడి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి సర్కారు శాంతిభద్రతల పర్యవేక్షణలో విఫలమైందని.. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుతారంటూ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే విలేకర్లతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు హోంమంత్రి అనితపై విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ హోంమంత్రి మైకుల ముందు మాత్రమే మంత్రి అంటూ ఎద్దేవా చేశారు. పోలీసులను బదిలీ చేసే అధికారం కూడా ఆమెకు లేదంటూ సెటైర్లు వేశారు.ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి వంగలపూడి అనిత కౌంటరిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వంగలపూడి అనిత ట్వీట్ చేశారు. ” అంబటి రాంబాబు గారూ.. నేను మైక్ ముందు హోంమంత్రినే కాదు.. ... Read more