Author: ijam journalist

Description of the image

narsapur express – రైలులో దోపిడీ యత్నం

అందప్రదేశ్ – పల్నాడు జిల్లాలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీ యత్నం చేసిన దుండగులు.. రైలుపై రాళ్లు రువ్విన దుండగులు అనంతరం, B1, S11, S12 కోచ్లోకి ప్రవేశించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసారు.. ప్రయాణికులు కోచ్లకి డోర్లు వేయడంతో లోపలికి వెళ్లలేకపోయిన దొంగలు.. దోపిడీ యత్నంపై రైల్వే పోలీసుల దర్యాప్తు..

venkayya naidu: రాజధాని అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి..

బాపట్ల – ఏపీ రాజధాని అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రతో మ్యూజియం ఏర్పాటు చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. మహనీయుల జీవిత చరిత్రలు నేటి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జాగర్లమూడిలో మాజీ ఎమ్మెల్యే కుప్పుస్వామి చౌదరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయనకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చీరాల రైల్వేస్టేషన్‌‌లో ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం వెంకయ్య నాయుడు కుప్పుస్వామి చౌదరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొన్నారు.