బంగ్లాదేశ్ లో ఇటీవల కాలంలో చెలరేగిన హింసకాండలో హిందువులపై దాడులు ఎక్కువయ్యాయని వాటిని అరికట్టాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందువులపై దాడికి వ్యతిరేకంగా కైకలూరు కలిదిండి గ్రామాల్లో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కైకలూరులో శ్రీ శ్యామలాంబ ఆలయం వద్ద నుండి హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తాలూకా సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో పెద్ద ఎత్తున హిందువులు పాల్గొని బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముస్లిం దేశాలలో హిందువులపై దాడులు తరచూ జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని హిందువులకు రక్షణ కల్పించాలని కోరారు. అల్ప సంఖ్యలో ఉన్న హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని వాపోయారు. ప్రపంచదేశాల్లో ఉన్న హిందువులందరికీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక తాలూకా సెంటర్లో మానవహారం గా ఏర్పడ్డారు. కార్యక్రమంలో కీర్తి వెంకట రాంప్రసాద్…
Author: ijam journalist
పౌరసరఫరాల రుణాల్లో వచ్చే ఏడాది 10వేల కోట్ల రూపాయలు చెల్లిస్తామని ప్రకటన – నాదెండ్ల మనోహర్ ఏలూరు – వచ్చే ఖరీఫ్ నుండి ధాన్యం కొనుగోళ్లకు సంబందించి 48 గంటల్లోనే రైతుల ఖాతాలకు నగదు జమ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అలాగే ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు పంటల బీమా ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరులోని సీఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో సోమవారం.. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు చెల్లించాల్సిన రూ.472 కోట్లు ? ధాన్యం బకాయిలను విడుదల చేస్తూ చెక్కులను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ.. “సివిల్ సప్లయిస్ పేరిట గత వైసీపీ ప్రభుత్వం రూ.40,500 కోట్ల రుణాలు తీసుకుంది. రైతులను సంక్షోభంలోకి నెట్టివేసింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు కూడా పంచకుండా ఇబ్బంది పెట్టారు.…
పొగాకు రైతులకు జిల్లాలో 15 కోట్లు, రాష్ట్రంలో 110 కోట్లు లబ్ది ఏలూరు: ఇటీవల దేవరపల్లి లో జరిగిన పొగాకు రైతుల అవార్డుల వేడుకలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రైతులు వారి సమస్యలు చెప్పగా తక్షణం స్పందించిన ఎంపీ ఢిల్లీ లో కేంద్ర కామర్స్ మినిస్టర్ ను కలిసి రైతులు అదనంగా పండించిన పొగాకు పంట పై ఫెనాల్టీ రద్దు చేయాలని కోరారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం అదనంగా పండించిన పొగాకు పంటకు ఫెనాల్టీ రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది.ఈ సందర్బంగా జిల్లాలో పొగాకు పంట పండించిన రైతులు వందలాదిగా ఏలూరు వచ్చి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఘనంగా సత్కరించారు.పొగాకు రైతు సంఘాల అద్యక్షులు పరిమి రాంబాబు, కరాటం రెడ్డి నాయుడు, కాకర్ల వివేకానంద లు మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి వలన జిల్లాలో ఉన్న 15 వేల మంది పొగాకు…
కృష్ణా, గోదావరి సంగమం వద్ద జలహారతులు పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు నియమిస్తామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. నెల్లూరు : కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు నియమిస్తామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సిజిఎఫ్ కింద 160 ఆలయాలు పున: నిర్మిస్తామని ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు ఆలయ భూములు పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. 50వేల రూపాయలు కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఆర్థిక సాయం పెంచుతున్నట్లు ప్రకటించారు. తిరుమల నుంచే దేవాదాయ శాఖలో ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకుంటున్నామని అన్నారు. నెల్లూరు జిల్లాలో…
నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ నగర్‌కు చెందిన కె నాగరాజు (23), సురేఖ(19) భార్యాభర్తలు. నాలుగేళ్ల కిందట ఇద్దరూ ప్రేమించి, వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్లు, 11 నెలల కుమారులు ఉన్నారు. నాగరాజు టైల్స్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేశాడు. సురేఖ మాగుంట లేఅవుట్లో ఓ బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్‌గా చేస్తుంది. చక్కగా సాగుతున్న వీరి కాపురాన్ని మద్యం చిన్నాభిన్నం చేసింది. నాగరాజు తాగుడుకి బానిసై, సంపాదించిన డబ్బంతా మద్యానికి ఖర్చు చేసేవాడు. ఈ క్రమంలో పలుచోట్ల అప్పులు చేశాడు. దీంతో కుటుంబ భారం మొత్తం సురేఖపై పడింది. మద్యం మానేయాలని, అప్పులు చేయవద్దని సురేఖ భర్తను వేడుకుంది. తీరు మార్చుకోని నాగరాజు మద్యం అలవాటును మానుకోవడానికి బదులు పుట్టింటికి వెళ్లి మద్యానికి డబ్బు తీసుకురావాలని సురేఖను ఒత్తిడి చేయసాగాడు. ఆ క్రమంలో భార్యభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులతో విసిగిన సురేఖ శనివారం ఇంట్లోనే…
హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ను కలిసి ఒక జిల్లాకి మోహన్ రంగా పేరు పెట్టాలని కోరిన రాధా రంగా మిత్రమండలి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లోని సైనిక్ స్కూల్ వద్ద రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ను కలిసి పుష్పగుచ్చం అందించిన రాధ రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పన్నాస పూర్ణచంద్రరావు (కాళపాలెం బుజ్జి) రాష్ట్రంలో ఒక జిల్లాకి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టేలా ప్రతిపాదన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాధా రంగా మిత్రమండలి నాయకులు పాల్గొన్నారు.
కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో ఏలూరు జిల్ల ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశానుసారం డిఎస్పీ డి. శ్రావణ కుమార్, కైకలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కృష్ణా కుమార్ పర్యవేక్షణలో ఎస్సై డి. వెంకట్ కుమార్ తన సిబ్బందితో కలిసి ముదినేపల్లి ప్రధాన రహదారులపై వాహనాల తనిఖీ చేసి, వాహనం పత్రాలను పరిశీలించారు. పత్రాలు సరిలేని వాహనదారులకు జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా పత్రాలు సరిలేని వాహనాలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకట్ కుమార్ హెచ్చరించారు.
వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తాం – పయ్యావుల కేశవ్ తుంగభద్ర డ్యామ్ ఘటనతో ఏపీ ప్రభుత్వం అలర్ట్డ్యామ్ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరాతుంగభద్ర డ్యామ్ అధికారులు, నిపుణులతో మాట్లాడాంవీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తాం – పయ్యావుల కేశవ్రాయలసీమ రైతులకు తుంగభద్ర డ్యామ్ జీవనాధారంసమస్యపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిందినీరు వృధాకాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాంప్రభుత్వం తరపున డ్యామ్ అధికారులకు సహకారం అందిస్తాం-మంత్రి పయ్యావుల కేశవ్