Author: ijam journalist

కైకలూరులోని శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగ, అత్యంత వైభవోపేతముగా నిర్వహించాలని స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ సూచించారు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి గోడపత్రిక, ప్రచార పత్రికలను మంగళవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఇలవేల్పు దేవత అయిన శ్రీ శ్యామలంబ అమ్మవారి దసరా మహోత్సవాలు విజయవంతం గా నిర్వహించాలన్నారు. తదనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సమకూర్చాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. సామాన్య భక్తులకు సునాయాసంగా అమ్మవారి దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలని, ప్రసాద నాణ్యతలో ఎక్కడ లోపం జరగకూడదన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ దగ్గరుండి పర్యవేక్షించి దసరా మహోత్సవాలను విజయవంతం చేస్తామన్నారు. కార్యనిర్వణ అధికారి విఎన్ కే శేఖర్ మాట్లాడుతూ అమ్మవారి భక్తులకు ఉచిత ప్రసాద, జల ప్రసాదం తో సహా అన్ని…

Read More

సమీక్ష చేసిన తర్వాతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన విషయాన్ని ప్రజలకు సీఎం చంద్రబాబు తెలియజెప్పి ఉంటారని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది పరిగణలోకి కోర్టు తీసుకుంటుందని పురంధేశ్వరి పేర్కొన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు వచ్చిన సమాచారంతో ఆయన ప్రకటన చేశారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. అధికారులతో సమీక్ష చేసుకున్న తర్వాతే తిరుమల లడ్డూ విషయంపై మాట్లాడి ఉంటారని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనతరం ఆయా సమస్యలపై అధికారుతో మాట్లాడారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. సీఎంగా ఆయన అపచారం జరిగిన విషయాన్ని ప్రజలకు తెలియ చెప్పి ఉంటారని చెప్పారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది పరిగణలోకి కోర్టు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని ‘మీరు ఎందుకు…

Read More

ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభంకానున్నాయి. ఈనెల 3న గురువారం నుంచి 13వ ఆదివారం తేదీ వరకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించిది. మొత్తం 10 రోజుల పాటు పండగ సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దసరా సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 12వ తేదీన దసరా పండుగ రానుంది. ఈ క్రమంలో పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 3 గురువారం నుంచి – 13 ఆదివారం తేదీ వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 రోజుల పాటు పండగ సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దాసర సెలవల అంతరం ఈనెల 14 సోమవారం తేదీన స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉదయం…

Read More

ఏలూరు జిల్లా : కైకలూరు జిల్లా పరిషత్ ఓరియంటల్ ఉన్నత పాఠశాల నందు హెడ్ మాస్టర్ ఎ. శ్రీకృష్ణ ఆద్వర్యంలో 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొని జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేసారు. అనంతరం స్కూల్ ఉత్తమ విద్యార్థులకు ప్రత్యేక బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో మాజి ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు, జెడ్పీటీసీ కురెళ్ళ బేబి, ఎంపీపీ అడవి కృష్ణా, సర్పంచ్ దానం నవరత్న కుమారి, ఎన్డీఏ కూటమి నాయకులు, స్కూల్ కమిటి సబ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

రాజన్న-సిరిసిల్ల జిల్లాలో ప్రణయ్ కుమార్ చేసిన పనికి అందరూ అవాక్అయ్యారు!సిరిసిల్ల జిల్లా తంగెళ్ళపల్లె గ్రామానికి చెందిన ప్రణయ్ యూట్యూబ్ పిచ్చితో నెమలి కూర ఎలా వొండాలో నేర్చుకొండి అంటూ.. ట్రడీషనల్ పికాక్ కర్రి అనే పేరుతో వంట వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసాడు, కాసేపటికే వీడియోకి వార్నింగ్ కామెంట్స్ రావడంతో.. యూట్యూబ్ నుండి వీడియో డిలీట్ చేసాడు, ఈ వీడియో గూర్చి ఫారెస్ట్ ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో, ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగి ప్రణయ్ కుమార్ ని అదుపులోకి తీసుకుని, ఆ ప్రాంతం అంతా పరిశీలించి, తను వొండిన కూరను హెన్డోవర్ చేసుకున్నారు. కూరను టెస్ట్ నిమిత్తం లాబ్ కు పంపుతున్నామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రణయ్ కుమార్ మాత్రం నేను వండింది కోడికూర అని యూట్యూబ్లో వ్యూవ్స్ ఎక్కువగా వస్తాయని నెమలి కూర అని పోస్ట్ అప్లోడ్ చేసానని చెబుతున్నాడు. ఏదిఏమైనా యూట్యూబ్ పిచ్చితో చాలామంది అవగాహన లేని…

Read More

ముదినేపల్లి మండలంలో మంగళవారం ఎన్డీఏ కూటమి నూతన కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసిన గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి డా” కొలుసు పార్ధసారధి, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, స్థానిక శాసనసభ్యులు డా” కామినేని శ్రీనివాస్. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రి పిన్నమనేని కోటేశ్వరరావు, మాజి ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు, జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, బిజేపి ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్. ప్రజలను చైతన్య పరుస్తూ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డా” మనోజ్ కుమార్తె, వైద్య విద్యార్థిని, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ని సత్కరించి, డా” బిఆర్ అంబేద్కర్ ప్రతిమను అందించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమిలోని టిడిపి, జనసేన, బిజేపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

ముదినేపల్లి మండలంలో వరుస బైక్ దొంగతనాలు జరగడంతో! ముదినేపల్లి ఎస్సై డి. వెంకట్ కుమార్ తన సిబ్బందితో కలిసి ప్రత్యేక నిఘాతో జల్లూరి మణికంఠ, కొట్టి సాయిరామ్ అనే ఇద్దరుని అరెస్టు చేసి వీరి వద్దనుండి నాలుగు బైక్స్, రెండు ట్రాక్టర్ చక్రాలను స్వాదీన పరుచుకున్నారు. నిందితులను కైకలూరు కోర్టుకు తరలించిన పోలీసులు.

Read More