ఏప్రిల్ 2023 లో కేజ్రీవాల్‌ని మొదటిసారి విచారించిన సీబఐ, కేజ్రీవాల్ మాజీ డిప్యూటీ మనీష్ సిసోడియా, భారత రాష్ట్ర సమితి నాయకురాలు కే కవితతో సహా 18 మంది నిందితులపై ఈ కేసులో ఇప్పటివరకు ఐదు ఛార్జీషీట్లు దాఖలు చేసింది. ఎన్నికల ప్రచారం కోసం హవాలా మార్గాల ద్వారా 2021 జూన్ నుంచి 2022 జనవరి వరకు రూ.44.45 కోట్లను గోవాకు బదిలీ చేశారని గత చార్జిషీట్లలో సీబీఐ పేర్కొంది. కొత్త విధానాన్ని 2021 మే 20, 21 తేదీల్లో రూపొందించారని, కోవిడ్ -19 మహమ్మారి పీక్‌లో ఉన్నప్పటికీ దిల్లీ ప్రభుత్వంలోని మంత్రిమండలి 2021 మే 21 న చాలా హడావుడిగా దానిని ప్రాసెస్ చేసి ఆమోదించిందని సీబీఐ ఆరోపించింది.