Saturday, September 21, 2024
HomeAndhra Pradeshandhra- రైతులకు ఉచితంగానే పంటల బీమా..

andhra- రైతులకు ఉచితంగానే పంటల బీమా..

పౌరసరఫరాల రుణాల్లో వచ్చే ఏడాది 10వేల కోట్ల రూపాయలు చెల్లిస్తామని ప్రకటన – నాదెండ్ల మనోహర్

ఏలూరు – వచ్చే ఖరీఫ్ నుండి ధాన్యం కొనుగోళ్లకు సంబందించి 48 గంటల్లోనే రైతుల ఖాతాలకు నగదు జమ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అలాగే ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు పంటల బీమా ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరులోని సీఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో సోమవారం.. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు చెల్లించాల్సిన రూ.472 కోట్లు ? ధాన్యం బకాయిలను విడుదల చేస్తూ చెక్కులను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ.. “సివిల్ సప్లయిస్ పేరిట గత వైసీపీ ప్రభుత్వం రూ.40,500 కోట్ల రుణాలు తీసుకుంది. రైతులను సంక్షోభంలోకి నెట్టివేసింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు కూడా పంచకుండా ఇబ్బంది పెట్టారు. జగన్ ప్రభుత్వం చేసిన ఆర్థిక అరా చకాలకు బ్యాంకులు భయపడిపోయాయి. కూటమి సర్కారు అధికా రంలోకి వచ్చాక మేము ఫోన్ చేస్తుంటే బ్యాంకర్లు ఫోన్లు కూడా ఎత్తడం మానేశారు. జగన్ సర్కారు బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.10వేల కోట్లు 2025 మార్చి 31వ తేదీ నాటికి చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజా కొంటాం. రైతులకు అనుకూలంగా, సమీపంలో ఉండే మిల్లులకే ధాన్యం తర లిస్తాం. గతంలో దళారులు స్వార్థంతో రైతులను ఇబ్బందులు పెట్టారు. గత ప్రభుత్వం కంప్యూటర్ చీటీల సాకుతో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను మిల్లర్ల చుట్టూ తిప్పారు. ఇకపై రైతులు మిల్లర్లకు, దళారులకు, వ్యాపార వేత్తలకు భయపడాల్సిన పనిలేదు. వ్యాపారవేత్తలే కాదు రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలి. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాం. రైతులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. వారికి బ్యాంకుల నుంచి రుణాలు అందేలా చర్యలు తీసుకుంటుంది. గత ప్రభుత్వం 84 వేల 724 మంది రైతులకు చెల్లించని రూ.1674.47 కోట్ల బకాయిలను మా కూటమి ప్రభుత్వం చెల్లిస్తోంది. రైతుల బకాయిల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా, రైతులకు సంబంధించిన ఫైళ్లు వెంటనే పెట్టాలంటూ చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే కష్టకాలంలోనూ వెయ్యికోట్ల బకాయిలు చెల్లించాం. మిగిలిన రూ.674 కోట్లు ఈ రోజు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశాం. ఇందులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే రూ.472 కోట్లు ధాన్యం బకాయిలు సొమ్మును రైతులకు చెల్లిస్తున్నాం’ అని తెలిపారు. అలాగే రైతులకు 50శాతం సబ్సిడీపై టార్పాలిన్లు అందిస్తామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments