కృష్ణా, గోదావరి సంగమం వద్ద జలహారతులు పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు నియమిస్తామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు.
నెల్లూరు : కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు నియమిస్తామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సిజిఎఫ్ కింద 160 ఆలయాలు పున: నిర్మిస్తామని ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు ఆలయ భూములు పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. 50వేల రూపాయలు కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఆర్థిక సాయం పెంచుతున్నట్లు ప్రకటించారు. తిరుమల నుంచే దేవాదాయ శాఖలో ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకుంటున్నామని అన్నారు. నెల్లూరు జిల్లాలో ఐదుగురు దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. మరో వివాదాస్పద అధికారిపై విచారణ చేపడతామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.