…………………….

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో
నవంబర్ 11 నుంచి భవానీ దీక్షలు ప్రారంభం కానున్నట్టు ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. 11వ తేదీ ఉదయం 11గంటలకు మండల దీక్ష స్వీకరణ ప్రారంభిస్తారు. 15వరకు దీక్షల స్వీకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.

డిసెంబర్1వ తేదీన అర్ధమండల దీక్షల విరమణలు ప్రారంభమై డిసెంబర్ 5వ తేదీతో ముగుస్తుంది. డిసెంబర్ 21 నుంచి 25 వరకు మండల దీక్షల విరమణలు జరుగుతాయి. దీంతో డిసెంబర్ 21నుంచి 26 తేదీ వరకు ఆలయంలో ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఏకాంతంగా అర్చకులు మాత్రమే సేవలు
నిర్వహిస్తారు.

భవానీ దీక్షల విరమణ సందర్భంగా ప్రతిష్ఠాపన, శతచండీయాగం, గిరి ప్రదక్షిణలు నిర్వహించనున్నారు.

……………………..

Share.
Exit mobile version