Kaikaluru : సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వద్ద రాటను ప్రతిష్టించి షష్ఠి ఉత్సవ పనులను ప్రారంభించిన కామినేని శ్రీనివాస్.
ముదినేపల్లి మండలంలోని సింగరాయపాలెం గ్రామం చేవూరుపాలెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం నందు రానున్న షష్ఠి మహోత్సవాలు సందర్భంగా కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ బుధవారం ఉదయం ఆలయ ప్రాకారములో రాటను ప్రతిష్టించి షష్టి మహోత్సవ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామివారి షష్ఠి మహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని.. కమిటీ సభ్యులు ఓర్పుతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలన్నారు.
అదేవిధంగా ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ సిబ్బంది మరియు కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలు ఆధ్యాత్మికతతో వైభవంగా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.