Telangana – No Caste Column: తెలంగాణలో కుల గణనలో భాగంగా నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
తెలంగాణలో కుల గణనలో భాగంగా నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సామాజిక న్యాయం సాధికారతలో భాగంగా కులగణన చేపడతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. విద్య, ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యత, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా కుల గణన చేపట్టాలని భావించింది. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కులగణనకు విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి కుటుంబాల నుంచి వివరాలు సేకరిస్తారు. దేశానికి రోల్ మోడల్ అయ్యేలా తెలంగాణలో కుట గణన చేపడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజల నుంచి వివరాలను సేకరించే దరఖాస్తుల్లో కులం, మతం వెల్లడించని వారి వివరాల నమోదుకు నో కాస్ట్, నో రిలిజియన్ కాలమ్ పెట్టాలంటూ దాఖలైన పిటిషనర్ల వినతులను పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశించింది.