కెనడాకు చెందిన యువతిని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడు. అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి శివారు వైకుంఠపురానికి చెందిన మనోజ్ కుమార్ కెనడా దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఆ దేశానికి చెందిన సహోద్యోగి ట్రేసీ రోచేదాన్ అతడికి పరిచయమైంది. ఇరువురి అభిప్రాయాలు మనసులు కలవడంతో సన్నిహితంగా ఉండేవారు.

ఈపరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో కెనడా దేశంలో వధువు రోచేడాన్ తో మనోజ్ కుమార్ కు వివాహమైంది.
ఇటీవల ఇండియా వచ్చిన ఆ జంట అమలాపురానికి వచ్చి భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం త్వరలో పెళ్లి చేసుకునేందుకు సోమవారం నుంచి సన్నాహాలు మొదలు పెట్టారు. బంధుమిత్రులతో ఆ ఇంట పెళ్లి సందడి నెలకొంది.

Share.
Exit mobile version