ఏలూరుజిల్లా ముదినేపల్లి మండలం ముదినేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 550 పైన ఉత్తిర్ణత సాధించిన 11 మంది విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఎన్నారైలు దొడ్డపనేని బాబురావు, రామకృష్ణ ఆర్ధిక సహకారంతో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ 11 మంది విద్యార్థులకు లాప్టాప్లు వీటితో పాటు రూ.5000/- (అయిదు వేల రూపాయిలు) నగదును అందజేశారు. ఈ సందర్బంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ దాతలు ఈ విధంగా విద్యార్థులను ప్రోత్సహించటం చాలా సంతోషకారంగా ఉందని, విద్యార్థులు ఇలాంటి బహుమతులు మరెన్నో అందుకుని ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బట్టలు, మొదలుగునవి బహుకరించటం చూసాం కానీ లాప్టాప్ లు బహుమతిగా అందించడం చాలా ఆనందదాయకం అని కొనియాడారు. వీటిని మంచిగా ఉపయోగించుకుని మంచి మార్గంలో ప్రయాణించాలని కన్న వారికీ, చదువు నేర్పిన గురువులకు, వున్న ఊరికి మంచి పేరు తేవాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, పాఠశాల యాజమాన్యం, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share.
Exit mobile version