అయ్యప్ప , భవాని మాల దీక్షాదారులకు ప్రతి రోజూ వడై (అల్పాహారం) ఏర్పాటు చేస్తున్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా చింతమనేని ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయిన ఆయన చేస్తున్న ప్రజా సేవా కార్యక్రమాలు మాత్రం ఏ రోజు ఆగకపోవటం చింతమనేని ప్రభాకర్ కార్యదక్షతకి నిదర్శనం అని చెప్పవచ్చు. కొవిడ్ విలయ తాండవం చేస్తున్న సమయంలో సైతం కొవిడ్ కేంద్రాల వద్ద పేషంట్లు బంధువులకు, అలాగే లాక్ డౌన్ టైమ్ లో హైవే పై ప్రయాణించే ప్రయాణికులకు లారీ డ్రైవర్లకు కూడా ఆహారాన్ని అందించారు చింతమనేని ప్రభాకర్.
దుగ్గిరాల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిత్యం జరుగుతున్న స్వాములకు, భవానీలకు వడై (అల్పాహార) కార్యక్రమాలను సోమవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పర్యవేక్షించి, స్వాములు భవానీలతో కలిసి వడై స్వీకరించారు. ప్రతి నిత్యం వడై కోసం వచ్చే స్వాములకు, భవానీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అల్పాహారం అందించేలా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన సిబ్బందికి సూచించారు.