Denduluru : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
రైతులు వద్ద నుండి ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లోకి నగదు జమవుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు. పెదపాడు మండలం కొక్కిరపాడు లోని రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఉదయం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. రైతు బాగుండాలి, వ్యవసాయం లాభసాటిగా వుండాలి అనే నినాదంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుందని, గతంలో రైతు కష్టపడి పండించిన పంటను అమ్మేందుకు చాలా ఆంక్షలు వుండేవని, కనీసం గోనే సంచులను సరఫరా చేయలేక గత ప్రభుత్వం చేతులెత్తేసిందని, ధాన్యం బకాయిలు ఎగ్గొట్టి రైతులను అవస్థలు పాలు చేసిందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. వైసిపి నాయకులు నిర్దేశించిన రైస్ మిల్లులోనే అమ్మాలని, రైతులను ఇబ్బంది పెట్టేవారని అటువంటి పరిస్థితి ఇకనుండి రైతులకు రాకూడదనే మిల్లులు ఎంపిక కూడా రైతులకే అందించామని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు.