Nuziveedu : సంస్థాగతంగా బిజెపి బలోపేతం – మాజీ మంత్రి కామినేని

నూజివీడు : క్షేత్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని మాజీ మంత్రి, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ అన్నారు. సోమవారం నూజివీడు లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు.బిజెపి జిల్లా అధ్యక్షులు సి. హెచ్. విక్రమ్ కిషోర్ సమావేశానికి అధ్యక్షుత వహించగా పట్టణ అధ్యక్షుడు బోను అప్పారావు అతిధులకు ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నేత్రుత్వంలోని ఎన్. డి. ఏ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.గ్రామీణ స్థాయిలో బిజెపి మరింత బలపడటానికి కార్యకర్తలు కార్యోణ్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. అన్నీ వర్గాల నుంచి వస్తున్న మద్దతుతో సభ్యత్వ నమోదులో నిర్దేశించిన లక్ష్యాన్ని పార్టీ శ్రేణులు అధిగమించాలని కోరారు. ఏలూరు జిల్లా లో నూజివీడు నియోజకవర్గం సభ్యత్వ నమోదులో నాలుగవ స్థానంలో ఉందని జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ తెలిపారు. సభ్యత్వ నమోదుకు ఈ నెలాఖరు వరకు సమయం ఉందని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ప్రతీ మండలంలో 3 వేలకు తగ్గకుండా పార్టీ బాద్యులచే సభ్యత్వాలు జరగాలని సూచించారు.జిల్లా బిజెపి కన్వీనర్ కట్నేని కృష్ణ ప్రసాద్,జిల్లా సభ్యత్వ ప్రముఖ్ శరణాల మాలతీ రాణి,జిల్లా ప్రధాన కార్యదర్శి, నూజివీడు నియోజకవర్గ ఇంచార్జ్ కోటప్రోలు కృష్ణ, నియోజకవర్గ కన్వీనర్ జి. ఆర్. కె. రంగారావు, జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మల్లిపూడి రాజశేఖర్, మాటూరి ప్రసాద్, జిల్లా కార్యదర్శి మాగంటి వాసు మాస్టర్,రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు శివరాజు వసుంధరదేవి,నూజివీడు, అగిరిపల్లి మండల పార్టీ అధ్యక్షులు గోగినేని శ్రీనివాస కుమార అప్పారావు, కొవ్వలి బాబురావు జిల్లా కార్యవర్గ సభ్యులు భావరాజు పుల్లారావు, దోసపాటి జనార్దనరావు,కుటుంబరావు చౌదరి,బడుగు శ్రీకాంత్,యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు దద్దనాల రవికిషోర్, మైనార్టీ మోర్చా నాయకులు షేక్ అలీషా,,పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డి మురళీమోహనరావు,బట్టా సత్యనారాయణ, శ్రీకర్,ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు సంజయ్,పార్టీ నాయకులు సాయన సత్యనారాయణ, అచ్యుత రామయ్య, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.