పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లోని టిడ్కో గృహాల కాలనీవాసులకు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుపుతున్న వాహనాన్ని ఈరోజు ఆదివారం ప్రారంభించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కాలనీవాసులు వివిధ పనుల నిమిత్తం గాంధీ బొమ్మల సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే దూరం కావడంతో ఎటువంటి వాహనాలు లేక ముఖ్యంగా మహిళలు నడిచి వెళ్ళవలసి వచ్చేది. వీరి పరిస్థితిని అర్థం చేసుకున్న మన మంత్రి నిమ్మల రామానాయుడు ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న హయాంలోనే ఉచిత ప్రయాణ వాహనాన్ని ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఆ ప్రాంతవాసులు ఉదయం నుంచి రాత్రి వరకు ఉచిత వాహనంలో రాకపోకలు సాగిస్తున్నారు. ఆ వాహనం కొంత పాతది కావడంతో అన్ని సౌకర్యాలతో మరో కొత్త వాహనాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరొకటి కొనుగోలు చేసి ఆ ప్రాంత వాసుల కోసం సిద్ధం చేశారు. కాలనీవాసులకు ప్రత్యేకంగా ఉచిత వాహనాన్ని ఏర్పాటు చేసినందుకు మంత్రి రామానాయుడు కు ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు…