గుడివాడ : దీపం-2 పథక లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందచేసిన నాయకులు
దీపం-2 పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని కూటమి పార్టీల నాయకులు పేర్కొన్నారు.
గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని విజయ గ్యాస్ ఏజెన్సీలో కూటమి పార్టీల నేతలతో కలిసి…మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, కృష్ణా జిల్లా బిజెపి అధ్యక్షుడు గుత్తికొండ శ్రీ రాజబాబు దీపం-2 పథక లబ్ధిదారులకు.. ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా.. సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. అబద్దాలపై పాలన చేసిన వైకాపా… ఇప్పటికీ బుద్ధి మార్చుకోక ఆకాశంపైకి ఉమ్మి వేసినట్లు సామాజిక మాధ్యమాల్లో… కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తుందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేసే కూటమి ప్రభుత్వంపై వైకాపా సైకోలు చేసే ప్రచారాన్ని ప్రజలెవరు విశ్వసించరని బుద్ధి మార్చుకోకపోతే గుణపాఠం తప్పదని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వి.రామకోటేశ్వరరావు, జిల్లా బిజెపి నాయకులు సురే గాంధీ, టిడిపి నాయకులు వసంతవాడ దుర్గారావు, చేకూరు జగన్మోహనరావు, వీర్ల వెంకటేశ్వరరావు,అల్లాడ శ్రీనివాసరావు, పొట్లూరి కృష్ణారావు, పోలాసి ఉమయ్య, గోకవరపు సునీల్, మహమ్మద్ రఫీ, గడ్డం ప్రకాష్ దాస్, కోలవెన్ను కృష్ణ, కూటమి పార్టీల నాయకులు, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.