వైయస్ఆర్ సీపి : ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా దేవినేని అవినాష్ పదవి బాధ్యత స్వీకార సభ

అమ్మఒడి, రైతు భరోసా పధకాలు కనుమరుగయ్యాయి, దీపం పధకం నీరుగారిపోయింది – వెలంపల్లి శ్రీనివాసరావు.

విజయవాడ బందరు రోడ్ లోని శేష సాయి కళ్యాణ మండపం నందు ఆదివారం నాడు వైభవంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా దేవినేని అవినాష్ పదవి బాధ్యత స్వీకార మహోత్సవం మరియు జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిధులుగా పాల్గొన్న రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, PAC మెంబర్, పశ్చిమ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, కృష్ణ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పేర్ని నాని, సెంట్రల్ ఇంచార్జ్ మల్లాది విష్ణు, నందిగామ ఇంచార్జ్ మొండితోక జగన్ మోహనరావు, తిరువూరు ఇంచార్జ్ నలగట్ల స్వామిదాస్, జగయ్యపేట ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు తదితర వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నడం సంతోషకరమన్నారు, 5 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు మంచి చేసింది లేదని విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారన్నారు. ఎన్నికలలో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సరైన సమాచారం లేక హామీలు ఇచ్చామని ఇప్పుడు ఆ హామీలను అమలుపరచలేమని చేతులెత్తేసిన దద్దమ్మ చంద్రబాబు అని మండిపడ్డారు. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు మరియు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండ పధకాలను తుంగలోకి తొక్కుతున్నారని తెలిపారు. కోవిడ్ లాంటి కష్ట సమయంలో జగన్ మోహన్ రెడ్డి సమర్థవర్దవంతంగా ఈ రాష్ట్ర ప్రజలకు పరిపాలన అందించారన్నారు. తెలంగాణ మరియు పక్క రాష్ట్రల ప్రజలు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోవిడ్ ఉచిత చికిత్స కోసం వచ్చిన పరిస్థితులు చూసాం అన్ని గుర్తుచేసుకున్నారు. కేవలం విజయవాడ లోని 32 డివిజన్లలో వరద వస్తే చర్యలు చెప్పటడంలో చంద్రబాబు ఈ కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. వరదల సమయంలో విజయవాడ కలక్టరేట్ లో ఉంటూ బస్సులో పడుకొని, ప్రొక్లైన్ లు ఎక్కి ప్రచార ఆర్భాటాల కోసం విజయవాడ నగరంలో తిరుగుతూ విజయవాడ ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్ని అన్నారు. వరద భాదితులకు తాగడానికి మంచి నీళ్లు గాని, పాలు గాని ఏది కూడా అందించలేని అసమర్థుడు చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 5 నెలలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పై అనేక దాడులు జరిగాయని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరు కలిసి దాడులను ఎదురుకొనేందుకు పోరాటాలు చేయాలన్నారు. మే లో అమ్మఒడి, రైతు భరోసా, వంటి అనేక పధకాలు అమలు చేయాలనీ కానీ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అమలు పరచలేదని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. దీపం పధకం గురించి ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వ పార్టీ లు, చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు హామీలుఇచ్చారని ఇప్పుడు దీపం పధకాన్ని నీరుగారుస్తున్నారన్నారు. ప్రజలు చంద్రబాబు మాటలకు పవన్ కళ్యాణ్ చేష్టలకు మోసపోయారన్నారు. రానున్న రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు దేగ్గర్లోనె ఉన్నాయన్నారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేయాలనీ కోరారు. ఎన్టీఆర్ జిల్లా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేసి జిల్లాలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేవిధంగా అందరం కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఎండి రుహుళ్ళ, మొండితోక అరుణ్ కుమార్, రాష్ట్ర నాయకులు పోతిన మహేష్, సర్ణాల తిరుపతిరావు, మాజీ చైర్మన్లు బండి పుణ్యశీల, మనోజ్ కొఠారి, తోలేటి శ్రీకాంత్, గౌస్ మొహిద్దీన్, డిప్యూటీ మేయర్లు అవుతూ శైలజ రెడ్డి, బెల్లం దుర్గ కార్పొరేటర్లు బలసాని మణెమ్మ, యరడ్ల ఆంజనేయ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.