AllAlerts : ఏలూరు ఉల్లిపాయబాంబ్ లు పేలిన ఘటనలో ఒకరు సంఘటన స్థలంవద్దే మృతి

ఏలూరు – దీపావళి పండుగ (Diwali) వేళ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. Eluru బాణాసంచా పేలిన ఘటనలో ఒకరు సంఘటన స్థలంవద్దే మృతి చెందారు. బైక్‌పై బాణాసంచాను తీసుకెళ్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక కొద్దిసేపు అయోమయానికి గురయ్యారు అక్కడి ప్రజలు. కొద్ది సేపటి తరువాత బాణాసంచా పేలిందని తెలియడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

దీపావళి పండుగ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుంతోంది. తాజాగా.. ఏలూరులో సుధాకర్ అనే వ్యక్తి బాణాసంచాను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఏలూరు తూర్పువీధి సెంటర్ వద్ద ఒక్కసారిగా ఆయన తీసుకెళ్తున్న బాణాసంచా పేలింది. దాంతో ఒక్కసారిగా పెనువిస్పోటనం సంభవించింది. బాణాసంచాను తీసుకెళ్తున్న సుధాకర్ పేలుడు ధాటికి రెండు ముక్కలయ్యాడు. సగబాగం చిందరవందరగా చుట్టుపక్కల పడ్డాయి. అలాగే అతని వెనకాల కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న మరో ఐదుగురు గాయపడ్డారు. మొత్తం ఈ సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. పండుగ రోజు బాణాసంచా పలేడు ఘటన స్థానికంగా సంచలన ప్రకంపనలు సృష్టించింది.

బాణాసంచా కొనుగోలు చేసి తీసుకెళ్తున్న సమయంలో బైక్ ఒక్కసారిగా అక్కడున్న చిన్నపాటి గోతిలో పడి కదలిక రావడంతో ఉల్లిపాయ టపాసులు పేలి పెద్ద ప్రమాదాని కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుధాకర్ తీసుకెళ్తున్న బాణాసంచాలో ఉన్న ఉల్లిపాయ బాంబులు పేలాయని స్థానికులు చెబుతున్నారు. పేలుడు విస్పోటనం కూడా తీవ్రంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ పేలుడులో సుధాకర్ శరీరం చిధ్రమైన దృశ్యాలు చూస్తే ఏ స్థాయిలో పేలుడు సంభవించిందో ఊహించవచ్చు. అయితే ఉల్లిపాయ బాంబు వల్ల ఇంత ప్రమాదం జరుగుతుందా అని ప్రజలు భావించే అవకాశం ఉంది. పెద్దమొత్తంలో ఉల్లిపాయ బాంబులు తీసుకెళ్తుండగానే పేలుడు సంభించిందని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి నిప్పులేకుండానే, కేవలం ఒత్తిడితోనే ఉల్లిపాయ బాంబులు పేలడంతో ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.