వయోభారంలో ఉన్న వృద్ధులను వారి వారసులు ఆదరించకుండా ఇబ్బంది పెడితే జైలు శిక్ష తప్పదని సీనియర్ సివిల్ జడ్జి వివిఎన్వి లక్ష్మి హెచ్చరించారు.

కైకలూరు కోర్టు ప్రాంగణంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయావృద్ధుల సంక్షేమ చట్టం 2007 ప్రకారం వారిని ఆదరించాలన్నారు. తల్లిదండ్రుల పోషణను విస్మరిస్తే వారి ద్వారా వారసులకు సంక్రమించే ఆస్తిని వెనుకకు తీసుకునే అవకాశం ఉందన్నారు. నిరాకరణకు గురైనట్లుగా రుజువైతే మూడు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని సూచించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పోషించే బాధ్యత వారి పిల్లలదేనని తెలియజేశారు. ఆ విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని, తల్లిదండ్రుల పోషణ నిమిత్తం వారికి కూడా మనోవర్తి ఇవ్వవలసి ఉంటుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పానల్ అడ్వకేట్స్ పి పవన్ కాంత్, డి శివప్రసాద్, బి ఇందిర తదితరులు పాల్గొన్నారు.

Share.
Exit mobile version