శ్రీ శ్యామలాంబ అమ్మవారి దసరా మహోత్సవాలు పోస్టర్ ఆవిష్కరణ

కైకలూరులోని శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగ, అత్యంత వైభవోపేతముగా నిర్వహించాలని స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ సూచించారు.

శ్రీ శ్యామలాంబ అమ్మవారి గోడపత్రిక, ప్రచార పత్రికలను మంగళవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఇలవేల్పు దేవత అయిన శ్రీ శ్యామలంబ అమ్మవారి దసరా మహోత్సవాలు విజయవంతం గా నిర్వహించాలన్నారు. తదనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సమకూర్చాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. సామాన్య భక్తులకు సునాయాసంగా అమ్మవారి దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలని, ప్రసాద నాణ్యతలో ఎక్కడ లోపం జరగకూడదన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ దగ్గరుండి పర్యవేక్షించి దసరా మహోత్సవాలను విజయవంతం చేస్తామన్నారు. కార్యనిర్వణ అధికారి విఎన్ కే శేఖర్ మాట్లాడుతూ అమ్మవారి భక్తులకు ఉచిత ప్రసాద, జల ప్రసాదం తో సహా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. నవరాత్రి పూజల తో పాటుగా చండీ మహాయాగములను వైభవంగా నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పండ్రంగి కనకదుర్గ ప్రసాద్, ఆచంట బలరామకృష్ణ,
బొగ్గవరపు శ్యాం ప్రసాద్, సింహాద్రి రాంబాబు, లక్మిoశెట్టి రామ్మోహన్ రావు, బొక్క వెంకట రావు కటికన రాఘవరావు, దైతగుంజ రామస్వామి, చావలి శంకర శాస్త్రి, వేములపల్లి కారుణ్య ఆలయ ఈవో వీఎంకే శేఖర్ నాయకులు వేంపాటి విష్ణు రావు పూలరాజి కొల్లి బాబి తదితరులు పాల్గొన్నారు.