బ్యాంకాక్‌లోని సబర్బన్‌లో బస్సు టైరు పగిలిపోవడంతో పెద్ద ప్రమాదం జరిగింది. 44 మందితో బస్సు ఉథాయ్ థాని ప్రావిన్స్ నుంచి తిరిగి వస్తుంది. పాఠశాల విద్యార్థులు, వారి టీచర్లు ట్రిప్‌కు వెళ్లివస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు ముందు టైరు పగిలిపోవడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(CNG)తో నడిచేది. క్రాష్ కారణంగా ట్యాంకుల్లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే బస్సులోకి మంటలు వ్యాపించాయి.
Telugu Hindustan Times