రాజన్న-సిరిసిల్ల జిల్లాలో ప్రణయ్ కుమార్ చేసిన పనికి అందరూ అవాక్అయ్యారు!
సిరిసిల్ల జిల్లా తంగెళ్ళపల్లె గ్రామానికి చెందిన ప్రణయ్ యూట్యూబ్ పిచ్చితో నెమలి కూర ఎలా వొండాలో నేర్చుకొండి అంటూ.. ట్రడీషనల్ పికాక్ కర్రి అనే పేరుతో వంట వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసాడు, కాసేపటికే వీడియోకి వార్నింగ్ కామెంట్స్ రావడంతో.. యూట్యూబ్ నుండి వీడియో డిలీట్ చేసాడు, ఈ వీడియో గూర్చి ఫారెస్ట్ ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో, ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగి ప్రణయ్ కుమార్ ని అదుపులోకి తీసుకుని, ఆ ప్రాంతం అంతా పరిశీలించి, తను వొండిన కూరను హెన్డోవర్ చేసుకున్నారు. కూరను టెస్ట్ నిమిత్తం లాబ్ కు పంపుతున్నామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రణయ్ కుమార్ మాత్రం నేను వండింది కోడికూర అని యూట్యూబ్లో వ్యూవ్స్ ఎక్కువగా వస్తాయని నెమలి కూర అని పోస్ట్ అప్లోడ్ చేసానని చెబుతున్నాడు.
ఏదిఏమైనా యూట్యూబ్ పిచ్చితో చాలామంది అవగాహన లేని పిచ్చి పనులు చేస్తున్నారు, ఇకనైనా వీడియో చేసేముందు ఆలోచించి చేయాలని కోరుతున్నారు వ్యూవర్స్.

