ముదినేపల్లి మండలంలో మంగళవారం ఎన్డీఏ కూటమి నూతన కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసిన గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి డా” కొలుసు పార్ధసారధి, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, స్థానిక శాసనసభ్యులు డా” కామినేని శ్రీనివాస్. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రి పిన్నమనేని కోటేశ్వరరావు, మాజి ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు, జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, బిజేపి ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్.

ప్రజలను చైతన్య పరుస్తూ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డా” మనోజ్ కుమార్తె, వైద్య విద్యార్థిని, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ని సత్కరించి, డా” బిఆర్ అంబేద్కర్ ప్రతిమను అందించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమిలోని టిడిపి, జనసేన, బిజేపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Share.
Exit mobile version