కైకలూరు నియోజకవర్గం లో 53వ రోజు అన్నా క్యాంటిన్ నిర్వహణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాలు మేరకు డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ 53 రోజుకు చేరింది. శనివారం అన్నదాతగా ఆవకూరు గ్రామస్తులు మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమల శెట్టి రామాంజనేయులు సతీమణి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుమారు 400 మందికి అన్నదానం అందించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబీ), తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పులా రాజి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాలు మేరకు దాతల సహాయం తో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ 53రోజుకు చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని, దాతలను మరొక్కసారి అభినందిస్తున్నాము అన్నారు. అన్నదానం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వం అన్నా క్యాంటీన్ అధికారకంగా ప్రారంభించేంతవరకు ఇలా దాతల సహాయం తో నడుపుతామని తెలిపారు. మాజీ మండల పరిషత్ ఉపాధ్యాక్షులు రహీం, సీనియర్ టిడిపి నాయకులు ఉస్మాన్ ఖాన్, జనసేన నాయకులు ఎంపీటీసీ మంగినేని రామకృష్ణ, తులసి పూర్ణచంద్రరావు, పెరుగు నాగ రాజు, ఆవకూరు పెద్దలు పాల్గొన్నారు.