నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ 26 గేట్ల ద్వారా శుక్రవారం నీటిని విడుదల చేసిన అధికారులు. 22 క్రస్ట్‌గేట్లను 5 అడుగులు, 4గేట్లను 10అడుగుల మేర ఎత్తి 2,30,504 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జునసాగర్‌ జలాశ యం నీటిమట్టం 587.50 అడుగులు ఉంది. ఇది 305.80 టీఎంసీలకు సమానం. కుడి కాలువ ద్వారా 8680 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 8367, 26 క్రస్ట్‌గేట్ల ద్వారా 2,30,504, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 29,029, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 2,78,380 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 3,11,491 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కాగా 26 క్రస్ట్‌గేట్ల ద్వారా నీరు విడుదల చేస్తుండడంతో తిలకించేందుకు పర్యాటకులు శుక్రవారం పోటెత్తారు. రహదారులు పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ సందడిగా గడిపారు.

42 టీఎంసీలకు చేరిన నదీ జలాలు

రదతో పోటెత్తిన పులిచింతల

అచ్చంపేట, ఆగస్టు 9: పులిచింతల ప్రాజెక్టులో శుక్రవారం 42.16 టీఎం సీల నీటి నిల్వ ఉంది. పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు వద్ద వరదనీరు పోటెత్తటంతో 11 గేట్ల ద్వారా కృష్ణా జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ నుంచి 2,30,244 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతుంది. ఇదిలా ఉండగా ప్రాజెక్టు నుంచి 2,42,355 క్యూసెక్కుల నీరు దిగువ కృష్ణకు విడుదలవుతోంది. 12వేల క్యూసెక్కుల నీరు పవర్‌ జనరేషన్‌ ద్వారా నదికి చేరుతోంది. ఆరు గేట్లను 2.50 మీటర్లు, మరో ఐదు గేట్లు మూడు మీటర్లు ఎత్తి కృష్ణాజలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కృష్ణానదికి వరదనీరు పోటెత్తటంతో మత్స్యకారుల పడవలు ఒడ్డుకు చేరాయి. ప్రయా ణీకులను దాట వేసే పడవలు కూడా పూర్తిస్థాయిలో నిలిచి పోయాయి.

Share.
Exit mobile version