ప్రజా సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి చంద్ర బాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని ఎమ్మెల్యే చింత మనేని ప్రభాకర్ అన్నారు. తోటగూడెంలో గురువారం జరిగిన మీ కోసం – మీ చింతమనేని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామసభ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుని, వారి నుంచి వినతులు స్వీకరించారు. తాగు, సాగు నీరు, గ్రామాల్లో పారిశుధ్యం, డ్రెయిన్ల మరమ్మతు, అంతర్గత రహ దారులు అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందజేస్తామన్నారు. గ్రామసభ ద్వారా దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కా రానికి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఉప్పలపాటి రామ్‌ప్రసాద్, గుత్తా అనిల్, లావేటి శ్రీనివాసరావు, పెద్ది రమేష్, కంభంపాటి సునీల్‌కుమార్, దండమూడి సీతారాం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఏలూరుజిల్లా
0 Views