ఘనంగా పైడితల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ
ఘనంగా పైడితల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ
పైడితల్లి అమ్మవారి నామస్మరణతో జువ్వలపాలెం గ్రామం మారుమోగింది. కాళ్ళ మండలం జువ్వలపాలెం గ్రామంలోని తూర్పుపేటలో భక్తులు, దాతలు, గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో నూతనంగా నిర్మించిన గ్రామదేవత పైడితల్లి అమ్మవారి ఆలయంలో విగ్రహం, ఆలయ శిఖర, జీవధ్వజ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు పుల్లేటికుర్తి గణపతిశర్మ బ్రహ్మత్వంలో గురువారం ఉదయం 9:30 నిమిషాలకు వేదమంత్రాల నడుమ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.నర్సాపురం పార్లమెంట్ మాజీ సభ్యుడు గోకరాజు గంగరాజు, టీడీపీ బోర్డు మాజీ సభ్యుడు గోకరాజు రామరాజు, జనసేన నాయకుడు చెనమల్ల చంద్రశేఖర్తో పాటు పలువురు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు