చిట్టి దోసెలతో రోజుకు రూ.10 వేలు సంపాదిస్తున్న మహిళ, రుచి సూపర్ అంటూ కస్టమర్లు క్యూ-sri sathya sai district kutagulla village road side hotel woman making dosa earns 10k daily ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
[ad_1]
నర్సమ్మ దోసెలు రుచిచూడాల్సిందే
శ్రీ సత్యసాయి జిల్లా : కదిరికి సమీపంలోని కూటగుళ్ల గ్రామంలో నర్సమ్మ హోటల్ ఉంది. రోజుకు రూ.10 వేలు చొప్పున నెలకు దాదాపు రూ. 3 లక్షల వ్యాపారం జరుగుతుందని నర్సమ్మ తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారం సాఫీగా సాగుతుందని అంటున్నారు. నర్సమ్మ హోటల్ లో వివిధ రకాల దోసెలు విక్రయిస్తారు. ఎగ్ ఎగ్ దోసె రూ. 25 , సాధారణ దోసెలు రూ. 10 , కారం దోసెలు రూ.25 అందిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం వరకు అమ్మకాలు జరుగుతాయని నర్సమ్మ తెలిపారు. రోడ్డు పక్కనే కావడంతో వాహనదారులు, ప్రయాణికులు ఈ హోటల్ కు వస్తుంటారు. నర్సమ్మ హోటల్ దోసెల రుచి తెలిసిన స్థానిక కూలీలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు అక్కడకు నిత్యం వస్తుంటారు. తక్కువ ఖర్చు, రుచికి అమోఘంతో నర్సమ్మ దోసెల కోసం క్యూ కడుతుంటారు. ఈ హోటల్ లో ఎగ్ దోసె ఫేమస్ అని నర్సమ్మ అంటున్నారు. సాధారణంగా ఒక దోసె తిందామని వచ్చిన వాళ్లు…ఆపకుండా లాగించేస్తారని అందుకే వ్యాపారం బాగా జరుగుతుందని నర్సమ్మ అంటున్నారు. తాను స్వయంగా తయారు చేసుకునే దోసె పిండి, రుచికరమైన చట్నీలు కారణంగానే కస్టమర్లు తరచూ వస్తుంటారని నర్సమ్మ తెలిపారు.
[ad_2]