గోల్స్ ఇలా..
22వ నిమిషంలో భారత ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్ గోల్ కొట్టాడు. దీంతో టీమిండియా ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, ఆ తర్వాత ఐదు నిమిషాల్లోనే గ్రేట్ బ్రిటన్ ప్లేయర్ లీ మోర్టోన్ (27వ నిమిషం) గోల్ బాదాడు. రెండో అర్ధభాగంలో ఏ జట్టు గోల్ చేయలేదు. దీంతో మ్యాచ్ సమమైంది. షూటౌట్ జరిగింది.