Tuesday, September 17, 2024
HomeTelanganaసీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్, బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే-gadwal mla krishna...

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్, బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే-gadwal mla krishna mohan reddy back to brs from congress big shock to cm revanth reddy ,తెలంగాణ న్యూస్


రెండు నెలల్లోనే

జులై 6న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ మ‌ల్లు ర‌వి ఆధ్వర్యంలో కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇంతలోనే ఆయన మనసు మార్చుకుని గులాబీ పార్టీకి తిరిగి వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్న సమయంలో…కాంగ్రెస్ నుంచి బ్యాక్ టు బీఆర్ఎస్ అని గద్వాల ఎమ్మెల్యే ఆ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ ఘర్ వాప్సీ మొదలుపెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్న తరుణంలో…ఓ ఎమ్మెల్యే చేజారిపోవడం గట్టి ఎదురుదెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు రాస్కోండి “బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ అబ్బా” అని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments