ఆగస్ట్ చివరిలో సంపదను ఇచ్చే శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దృక్ పంచాంగ్ ప్రకారం ఆగష్టు 25, 2024 ఉదయం 01:24 గంటలకు శుక్రుడు సింహ రాశి నుండి కన్యా రాశికి వెళ్లి సెప్టెంబర్ 18 వరకు ఈ రాశిలో ఉంటాడు. దీని వల్ల శుక్రుడు, కేతువులు ఒకరికొకరు దగ్గరగా వస్తారు. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం కన్యలో శుక్రుడు, కేతువుల కలయిక కొన్ని రాశిచక్ర గుర్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ విజయవంతమవుతాయి. భౌతిక సుఖాలు పెరుగుతాయి. రాహు-కేతువుల కలయిక వల్ల ఏ రాశుల వారి అదృష్టం మెరుస్తుందో తెలుసుకుందాం.