ఈ గణపతి విగ్రహాలను పదవ రోజు అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేస్తారు. వివిధ పూజా కమిటీలు పూజను నిర్వహిస్తాయి. మండపాల వద్ద తొమ్మిది రోజులు పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉదయం, సాయంత్రం పూజలు నిర్వహిస్తూ కోలాహల వాతావరణం నెలకొంటుంది. అయితే పూజా ఆచారాలు చాలా మంది భక్తులు తమ ఇళ్లలో కూడా నిర్వహించుకుంటారు. విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత మూడు, ఐదు, ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు నిర్వహిస్తారు. అనంతరం నిమజ్జనం చేస్తారు.