ఈ తరుణంలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పని చేస్తున్న లైన్ మెన్ కూర రామయ్య వరద ఉద్ధృతిని కూడా లెక్క చేయకుండా… విద్యుత్ పునరుద్దరణే లక్ష్యంగా తీగలపై నడుచుకుంటూ వాగు దాటి విద్యుత్ సేవలను అందించారు. విధి నిర్వహణలో రామయ్య చూపిన సాహసం, తెగువ అభినందనీయమని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కొనియాడారు. ఇది ఎంతో మంది ఉద్యోగులకు ఆదర్శమని, మరెంతో మందిలో చైతన్యం నింపుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఈ మేరకు ట్వీట్ చేశారు.