TG Electricity Commission Chairman : బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు కమిషన్ వేసింది. ఈ కమిషన్ ఛైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో తాజాగా విద్యుత్ కమిషన్ కు కొత్త ఛైర్మన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. విద్యుత్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ నియమించింది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు సీజేగా, ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. ఇంతకు ముందు విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వం నూతన ఛైర్మన్ ను మార్చింది.