IRCTC Sapta Jyotirlinga Yatra : ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్) సందర్శనను కవర్ చేస్తూ 2AC, 3AC, SL తరగతుల్లో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో “సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర” టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తోంది. ఈ ట్రైన్ ఆగస్టు 17 విజయవాడ నుంచి బయలుదేరనుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మీదుగా ఈ రైలు ప్రయాణించి… పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్) ఆలయాలను కవర్ చేస్తుంది. మొత్తం 12 రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలను పూర్తి చేయవచ్చు.