స్త్రీలందరూ లక్ష్మీ సమానంగా అలంకరించుకొని, అమ్మవారిని అర్చిస్తారు. రెండో శుక్రవారమే శ్రావణ శుక్రవారం. ఇదే శ్రీ వరలక్ష్మీ వ్రత దినం. అయితే శ్రావణమాసం గనుక శుక్రవారంతో మొదలయితే దానికి అంతకుముందు రోజే నిష్క్రమించిన అమావాస్య స్పర్శ కొంతైనా ఉంటుంది. గనుక అలా వచ్చినపుడు మాత్రమే 3వ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాచరణ చెప్పబడింది. వరలక్ష్మీ వ్రతం ఆచరించే స్త్రీలు, రాఖీ పండుగ జరుపుకునే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు, నూతన యజ్ఞోపవీత ధారణ చేసే పురుషులు…. ఈ శ్రావణ పౌర్ణమి, శుక్రవారం సంబరాలతో ఈ శ్రావణంలో లోగిళ్లన్నీ కోలాహలంగా ఉంటాయి.