Sunday, September 15, 2024
HomeTelanganaమీ సెల్ ఫోన్ పోయిందా? టెన్షన్ వద్దు ఇలా చేయండి-rajanna sircilla topped in cell...

మీ సెల్ ఫోన్ పోయిందా? టెన్షన్ వద్దు ఇలా చేయండి-rajanna sircilla topped in cell phones recovery sp praised staff suggested public use ceir site ,తెలంగాణ న్యూస్


సెల్ ఫోన్ పోయిందా…సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేయండి‌

సెల్ ఫోన్ పోయిందా.. అయితే టెన్షన్ పడవద్దు. వెంటనే సీఈఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందర్లోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. కేంద్ర టెలికాం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సీఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా వెతికి పట్టుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సెల్ ఫోన్ పోయిన వ్యక్తి ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి, లేదా మీసేవ కేంద్రానికి వెళ్లి www.ceir.gov.in అనే వెబ్ సైట్లో లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/ స్టోలెన్ అనే లింక్ పై క్లిక్ చేసి, సెల్ ఫోన్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. దీంతో పాటు ఏరోజు, ఎక్కడ పోయింది….రాష్ట్రం, జిల్లా, పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరిగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈమెయిల్ ఐడీ, ఓటీపీ కోసం మరో సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తరువాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది. తద్వారా సంబంధిత ఐడీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చన్నారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments