Malavya raja yogam: నవగ్రహాలలో శుక్రుడిని సంపద ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు. వేద జ్యోతిషశాస్త్రంలో శుక్ర గ్రహం సంపద, ఆస్తి, ఆనందం, విలాసవంతమైన జీవనశైలికి కారకంగా భావిస్తారు. జాతకంలో శుక్రుని స్థానం బలంగా ఉంటే జీవితంలో సంతోషం, ఐశ్వర్యం, ఆనందానికి లోటు అనేది ఉండదు.