రానున్న కొద్ది రోజుల్లో బుధ, శుక్ర, అంగారక గ్రహాల కదలికలు మారనున్నాయి. ఆగస్ట్ 5 నుంచి సింహ రాశిలో అస్తంగత్వ దశ, తిరోగమన దశలో ఉన్న బుధుడు ఆగస్టు 22న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. సంపద, ఆర్థిక శ్రేయస్సును ఇచ్చే శుక్రుడు ఆగస్ట్ 25న కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని తర్వాత వృషభ రాశిలో ఉన్న కుజుడు 45 రోజుల అనంతరం ఆగస్ట్ 26న మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బుధ, శుక్ర, అంగారక గ్రహాల గమనంలో మార్పు రావడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం ఖాయం. బుధ, శుక్ర, అంగారక గ్రహాల ఆశీస్సులు ఏ రాశుల వారికి లభించబోతున్నాయో తెలుసుకుందాం.