Sunday, September 15, 2024
HomeAndhra Pradeshప్రకృతి ప్రేమికులు గిరిజనులు : ఎంపీ పుట్టా మహేష్ కుమార్

ప్రకృతి ప్రేమికులు గిరిజనులు : ఎంపీ పుట్టా మహేష్ కుమార్

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరి పుత్రులకు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవి బిడ్డలైన గిరిజనులు ప్రకృతి ప్రేమికులని, కల్మషం లేనివారని, ప్రాచీన చరిత్రకు, సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం అని ఎంపీ అభివర్ణించారు. ఈ సందర్భాన్ని పురస్కారించుకుని పుట్టా మహేష్ కుమార్ తన సందేశంలో నాగరిక ప్రపంచానికి దూరంగా కొండకోనల్లో జీవనం సాగించే ఆదివాసీలు ప్రపంచ వ్యాప్తంగా 48 కోట్ల పైగా ఉన్నారు, ఏలూరు జిల్లా లో గిరిజన జనాభా 2,70,000 నుండి 3,50,000 వరకు ఉన్నారని అడవులు, ప్రకృతి పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. అరకు కాఫీ పారిస్ మార్కెట్ లో ప్రజాదరణ పొందటం, అరకు కాఫీకి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం చూస్తుంటే ఆదివాసీలకు భారత దేశం ఇస్తున్న ప్రాధాన్యత అర్ధమవుతుందన్నారు. 1995 సం లో ఆనాటి ముఖ్యమంత్రిగా నారా చంద్ర బాబు నాయుడు గిరిజనుల కోసం చైతన్యం అనే కార్యక్రమాన్ని తీసుకు వచ్చారని, దాన్ని గత ప్రభుత్వం తుంగలో తొక్కిందని, దానిని ఈ రోజు నుండి చైతన్యం 2.0 గా ముందుకు తీసుకువెల్లతామని అన్నారు, ప్రతి గిరిజన మండలంలో అన్న కాంటీన్ పునఃప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఎంపీ పుట్టామహేష్ కుమార్ ధన్యవాదములు తెలిపారు. రాష్ట్రపతి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ప్రపంచీకరణ కారణంగా ఆదివాసుల జీవితాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయన్నారు. భారత దేశంలో 705 ఆదివాసీ తెగలు ఉన్నాయని, దేశజనాభా లో 9% ఉ న్న ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి అందరికీ తెలియచేసి వారి హక్కుల పరిరక్షణకు అందరం కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments